E-Paper
Advertisement

Wipro and Infosys:ఆ కంపెనీలకు ఏమైంది? ఫ్రెషర్లలో ఆందోళన!

Wipro and Infosys:ఆ కంపెనీలకు ఏమైంది? ఫ్రెషర్లలో ఆందోళన!
Advertisement

Wipro and Infosys:ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి… ఐటీ కంపెనీలు. కొన్ని దేశీయ కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఇటీవలే విప్రో కొందరు ట్రైనీలను తీసేయడంతో పాటు మరికొందర్ని సగం జీతానికే పనిచేయమని అడగడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మరోవైపు టీసీఎస్ కూడా… ట్రైనీలకు ఇంకా ప్రాజెక్టులు అప్పగించాల్సి ఉందని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… ఇన్ఫోసిస్, విప్రో ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2022తో పోలిస్తే… 2023లో నియామకాలు భారీగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏకంగా 50 శాతం క్షీణించవచ్చని చెబుతున్నారు.

2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విద్యార్థులకు… ఇన్ఫోసిస్, విప్రో ఇంకా క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించలేదు. దిగ్గజ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కూడా ఆ రెండు కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ జరపకపోవడం… నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది నియమించుకున్న వారిలో ఎక్కువ మంది బెంచ్ మీద ఉండటం కూడా… తాజాగా నియామకాలు చేపట్టకపోవడానికి కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్యే క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. కానీ చాలా టైర్-1 కంపెనీలు నియామకాల కోసం ఇప్పటికీ కాలేజీలకు వెళ్లలేదు. సాధారణంగా నవంబర్-డిసెంబర్‌ మధ్య క్యాంపస్ సెలక్షన్స్ జరిపే ఇన్ఫోసిస్ కూడా… ఫిబ్రవరి పూర్తి కావొస్తున్నా… నియామకాలకు దూరంగా ఉంది. వచ్చే నెలలో అయినా ఇన్ఫోసిస్ క్యాంపస్ సెలక్షన్స్ జరుపుతుందేమోనని బడా కాలేజీలు ఎదురుచూస్తున్నాయి.

Advertisement

క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించకపోవడంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల ప్రతిభే తమ ఆస్తి ఆని, అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారిని నియమించుకోవడానికి కట్టుబడి ఉంటామని పేర్కొంది. ఇక ఇన్ఫోసిస్ కూడా… కొత్త నియామకాల అంశాన్ని నాలుగో క్వార్టర్ చివర్లో పరిశీలిస్తామని పేర్కొంది. ప్రస్తుతానికి డిమాండ్‌ మేరకు ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. రెండు కంపెనీల స్పందన చూస్తుంటే… ఒకవేళ కొత్త నియామకాలు జరిపినా… చాలా తక్కువ మందికే అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ

Advertisement

New Electric Scooty:మార్కెట్లోకి మరో 2 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×