Current, Tatkal, Premium Tatkal Tickets : భారత్ లో రోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. టిక్కెట్ బుకింగ్ కోసం ప్రస్తుతం పలు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి. 1. కరెంట్ టిక్కెట్స్, 2.తత్కాల్ టిక్కెట్స్, 3 ప్రీమియం తత్కాల్ టిక్కెట్స్. ఈ టిక్కెట్లను ప్రయాణీకులకు రైలు ప్రారంభానికి చివరి నిమిషం వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రీమియం తత్కాల్ టిక్కెట్స్ మినహా ఇతర టిక్కెట్లలో సీట్లు కన్ఫామ్ అవుతాయనే గ్యారెంటీ లేదు.
నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు
దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ బుకింగ్ ట్రెండ్
ప్రస్తుతం చాలా మంది ప్రయాణీకులు ఆన్ లైన్ లోనే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ ప్రక్రియ చాలా ఈజీగా ఉండటంతో అందరూ ఇదే విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు.
కరెంట్ టిక్కెట్ ఫీచర్లు
కరెంట్ టికెట్ అనేది ప్రయాణం రోజునే బుక్ చేయబడింది. దీని బుకింగ్ రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు ప్రారంభమవుతుంది.
కరెంట్ టికెట్ ప్రయోజనాలు
కరెంట్ టికెట్ అనేది చివరి నిమిషంలో ప్రయాణానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అయితే, టిక్కెట్లు అందుబాటులో ఉంటాయా? లేదా? అనేది తెలియదు.
తత్కాల్ టికెట్ ఎలా తీసుకోవాలంటే?
తత్కాల్ టిక్కెట్లు ఒక రోజు ముందుగానే బుక్ చేయబడతాయి. దీని ధర సాధారణ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్
AC కోచ్ ల కోసం ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. నాన్-AC కోచ్ ల కోసం ఉదయం 11 గంటలకు బుకింగ్ షురూ అవుతుంది. ఇది చివరి నిమిషంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ టికెట్ ఫీచర్లు
ప్రీమియం తత్కాల్ టికెట్ ధర చాలా ఎక్కవుగా ఎక్కువ. డైనమిక్ ఛార్జ్ కారణంగా అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం
ఈ టికెట్‌ను కూడా ఒక రోజు ముందుగా ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నాన్-ఏసీ తరగతుల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
సీటు కన్ఫామ్ ఛాన్స్ ఎక్కువ
ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటే సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టిక్కెట్‌ను IRCTC వెబ్‌సైట్ నుండి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రయాణ ప్రణాళికకు అనుకూలంటా టిక్కెట్లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు రకాల రైలు టిక్కెట్లు ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడంలో సాయపడుతాయి. దీంతో సరైన సమయానికి టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రక్రియ ఈజీగా ఉంటుంది. మీ వీలును బట్టి ఈ టిక్కెట్లను పొందే అవకాశం ఉంటుంది.
Read Also : ఈ రైల్ కోచ్ లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్.. ఎక్కడో కాదు , మన దగ్గరే!