EPAPER

Railway Rules: పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే ట్రైన్ లో బెర్త్ ఇస్తారా? ఏ వయసు వరకు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు?

Railway Rules: పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే ట్రైన్ లో బెర్త్ ఇస్తారా? ఏ వయసు వరకు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు?

Train Ticket Age Limit For Children: ఈ రోజుల్లో చాలా మంది దూర ప్రయాణాలు చేయడానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. చక్కటి బెర్తులు, ఆహ్లాదకర వాతావరణంలో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే, ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా టికెట్లు బుక్ చేసుకుని రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే, పెద్దలు కచ్చితంగా టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేస్తారు. పిల్లల విషయానికి వచ్చే సరికి కాస్త తికమక పడుతుంటారు. ఏ వయసు వరకు పిల్లలు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు? ఏ వయసు వరకు పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవాలి? ఒకవేళ హాఫ్ టిక్ తీసుకుంటే బెర్త్ ఇస్తారా? ఏన్ని సంవత్సరాల వయసు నుంచి ఫుల్ టికెట్ తీసుకోవాలి? అనే విషయంలో క్లారిటీ ఉండదు. అసలు పిల్లల విషయంలో రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి? ఏ ఏజ్ వారికి ఏ టికెట్ తీసుకోవాలి?


నాలుగు సంవత్సరాల వరకు పిల్లలకు నో టికెట్   

భారతీయ రైల్వే సంస్థ ప్రతి విషయానికి ఓ నిబంధన రూపొందించినట్లే, పిల్లల విషయంలోనూ కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. ఏ వయసు పిల్లలు ఏ టికెట్ తీసుకోవాలి? అనే విషయంలో క్లియర్ కట్ గా కొన్ని రూల్స్ ను ఫ్రేమ్ చేసింది.  రైల్వే నిబంధనల ప్రకారం ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలు రైలు టిక్కెట్లపై ప్రయాణించాల్సిన అవసరం లేదు. అలాంటి పిల్లలకు ఎలాంటి రిజర్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులతో కలిసి వాళ్లు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు.


హాఫ్ టికెట్ ఎప్పుడు తీసుకోవాలి?

రైల్వే నిబంధనల ప్రకారం.. పిల్లల వయస్సు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, హాఫ్ టికెట్ తీసుకుంటే పిల్లలకు బస్సులలో మాదిరిగా బెర్త్ ఇవ్వరు. హాట్ టికెట్ ఉన్నా తల్లిదండ్రుల పక్కనే కూర్చోవాల్సి ఉంటుంది.

పిల్లలకు బెర్త్ కావాలంటే ఏం చేయాలి?

ట్రైన్ జర్నీ చేయాలనుకునే పిల్లల వయస్సు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటే హాఫ్ టికెట్ తీసుకోవచ్చు. కానీ వారికి ప్రత్యేకంగా బెర్త్ ఇవ్వరు. ఒక వేళ వారికి కచ్చితంగా బెర్త్ కావాలనుకుంటే పిల్లల కోసం ఫుల్ టికెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్ పూర్తి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ కేటాయిస్తారు.

అటు, టికెట్ రిజర్వేషన్ చేసేటప్పుడు 4 సంవత్సరాలలోపు పిల్లల పేర్లు వివరాలను ఎంటర్ చేస్తే, పూర్తి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వివరాలు నింపకపోతే, 1 నుంచి 4 సంవత్సరాల మధ్య పిల్లలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 12 సంవత్సరాలు నిండిన పిల్లలకు రైల్వే నింబంధనల ప్రకారం కచ్చితంగా ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే పెద్దలకు వర్తించే రూల్స్ అన్నీ వీరికి కూడా వర్తిస్తాయి.

Read Also: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

Related News

Railway Rules: మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఏసీలో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?

Train Ticket Booking: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Hydrogen Train: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

Big Stories

×