EPAPER

Hydrogen Bike: మతిపోగొడుతున్న కొత్త టెక్నాలజీ.. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే బైక్!

Hydrogen Bike: మతిపోగొడుతున్న కొత్త టెక్నాలజీ.. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే బైక్!

Hydrogen Bike: బజాజ్ ఆటో సిఎన్‌జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్‌జి 125 ఇటీవలే భారత ఆటోమొబైల్ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇప్పుడు అది గతం. ఇప్పుడు ప్రజలు సిఎన్‌జి బైక్ కోసం కాకుండా హైడ్రోజన్‌తో నడిచే బైక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బైక్‌ను వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్, మొబిలిటీ లిమిటెడ్ స్టాల్ మొదటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించింది. ఈ బైక్  హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడస్తుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. తక్కువ-స్పీడ్ కేటగిరీలో ఉన్న ఈ హైడ్రోజన్ పవర్డ్ స్కూటర్ 55 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.


జాయ్ ఇ-బైక్  హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఆవిష్కరించింది. దీనితో పాటు  EV కాంపోనెంట్స్ (అసెంబ్లీ లైన్, మోటార్, కంట్రోలర్, బ్యాటరీ ప్యాక్, సెల్స్) ఇంటర్నల్ మ్యాన్యుఫ్యాక్చురింగ్  సామర్థ్యాలతో కూడిన EV అనుబంధ క్లస్టర్ మోడల్‌ను కూడా ప్రదర్శించారు. కొత్త కాన్సెప్ట్‌లతో పాటు కంపెనీ ‘జాయ్ ఇ-రెక్’ బ్రాండ్‌తో కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను కూడా పరిచయం చేసింది.

Also Read: BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్


ప్రస్తుతం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అభివృద్ధి దశలో ఉందని, ఇది కొత్త తరం వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఒక అద్భుతమైన దశ అని కంపెనీ వెల్లడించింది. పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ టెక్నాలజీ యుటిలిటీ వాహనాలతో సహా వివిధ విభాగాలలో అమలు చేయనున్నారు. ఏ అండ్ ఎస్ పవర్‌తో కంపెనీ ఇటీవలి భాగస్వామ్యం తరువాతి తరం లిథియం-అయాన్ సెల్ టెక్నాలజీ డెవలప్మెంట్‌పై పనిచేస్తుంది.

హైడ్రోజన్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మాట్లాడితే హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యల సూత్రంపై పనిచేసే ఈ బైక్‌లకు హైడ్రోజన్ ఇంధన సెల్ హార్ట్‌గా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన విద్యుత్ బైక్ ఎలక్ట్రిక్ మోటారును రన్ చేస్తోంది. దీని ఏకైప బై ప్రొడక్డ్ వాటర్. ఇంధన కణంలో యానోడ్, కాథోడ్ ఉన్నాయి. యానోడ్ వద్ద హైడ్రోజన్ అణువులు ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తాయి. ఇవి బాహ్య సర్క్యూట్ ద్వారా కాథోడ్‌కు ప్రవహిస్తాయి. ఇక్కడ అవి ఆక్సిజన్ అయాన్లతో కలిసిపోతాయి.

Also Read: Best Selling Scooters: సేల్స్‌లో కింగ్‌లు.. ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్లు ఇవే!

ఈ ఎలక్ట్రిక్ ప్రవాహం నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ పవర్డ్ బైక్‌లు సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌లతో పోలిస్తే సున్నా ఉద్గారాలు, అధిక మైలేజీ వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. హైడ్రోజన్ అవస్థాపన, అధిక ప్రారంభ ధర వాహనాలు ఒక సవాలుగా ఉన్నప్పటికీ దీని ప్రారంభం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహన విభాగంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×