Big Stories

Vehicle sales season : పండుగ సీజన్లో వాహన అమ్మకాలు అదుర్స్..

Vehicle sales season : దసరా, దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా వాహనాల అమ్మకాలు దుమ్మురేపాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 48 శాతం వాహనాల అమ్మకాలు పెరిగాయి. 2021 అక్టోబరులో మొత్తం 14,18,726 వాహనాలు అమ్ముడుపోగా… ఈ ఏడాది అక్టోబర్లో అవి 20,94,378కి చేరాయి. కరోనాకు ముందు.. అంటే… 2019 అక్టోబరుతో పోల్చినా… ఈ ఏడాది అక్టోబర్లో 8 శాతం వాహన రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. మొత్తమ్మీద… గత నాలుగేళ్లలో ఈ ఏడాదే వాహన అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.

- Advertisement -

ప్రయాణికుల వాహనాల్లో 41%, ద్విచక్ర వాహనాల్లో 51%, త్రిచక్ర వాహనాల్లో 66%, వాణిజ్య వాహనాల్లో 25%, ట్రాక్టర్ల అమ్మకాల్లో 17% మేర వృద్ధి కనిపించింది. కొవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య పెరగడంతో… గత పదేళ్లలోనే అత్యధికంగా ఈ ఏడాది ప్రయాణికుల వాహన విక్రయాలు జరిగాయి.

- Advertisement -

42 రోజుల పండుగ సీజన్లో మొత్తం వాహనాల రిటైల్‌ అమ్మకాలు 29 శాతం వృద్ధితో 28,88,131కు చేరుకున్నాయి. ప్రయాణికుల వాహనాలు 34 శాతం పెరిగి 4,56,413కు… ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 26 శాతం వృద్ధితో 21,55,311కు చేరుకున్నాయి. త్రిచక్ర, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు 68, 29, 30 శాతం మేర రాణించాయి. ఓవైపు ధరలు పెరుగుతున్నా… వాహన అమ్మకాల్లో జోరు ఏ మాత్రం తగ్గడం లేదని… భవిష్యత్తు కాలుష్య ఉద్గార ప్రమాణాలను అందుకునేలా వాహనాలు తయారు చేస్తున్నందున… రేట్లు పెరిగినా కొనేవాళ్లు వెనకడుగు వేయడం లేదని… నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News