EPAPER

Unclaimed Funds in Stock Market: స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌.. రూ.1.91 లక్షల కోట్లు వెయిటింగ్..!

Unclaimed Funds in Stock Market: స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌.. రూ.1.91 లక్షల కోట్లు వెయిటింగ్..!

Unclaimed Funds in Stock Market, LIC, Banks: రండి.. రండి.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక దగ్గర 25 వేల కోట్ల రూపాయలు.. మరో దగ్గర 35 వేల కోట్లు.. ఇంకో దగ్గరైతే 62 వేల కోట్లు.. ఇలా అన్ని కలిపి ఒక లక్షా 91 వేల కోట్ల రూపాయలు.. ఊరికే పడి మూలుగుతున్నాయి. ఎవరివో తెలీదు.. తెలుసుకునే అవకాశం కూడా ఎవరూ చేయడం లేదు. కానీ అలా పడి ఉన్నాయంతే.. మరి వీటిని దక్కించుకోవడం ఎలా..? ఈ అందని ద్రాక్షను చేజిక్కించుకోవడం ఎలా..? అసలు ఇదంతా ఎవరి డబ్బు..? ఈ డబ్బంతా ఎక్కడుంది..?


దలాల్‌ స్ట్రీట్‌ ఢమాల్.. బేర్‌మన్న బుల్.. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. ఇలా కొన్ని రోజులు.. బుల్‌ జోష్‌.. రోజురోజుకు పెరుగుతున్న ఇన్వెస్టర్ల సంపద.. 75 వేల మార్క్‌ను క్రాస్‌ చేసిన సెన్సెక్స్.. ఇలా మరికొన్ని రోజులు.. ఇవీ మనం స్టాక్‌ మార్కెట్‌ గురించి పబ్లిక్ హాలిడేస్‌లో తప్ప వినిపించే మాటలు. రోజు లక్షల కోట్ల విలువైన షేర్లు చేతులు మారుతుంటాయి. సంపన్నుడు బీకారి అవుతాడు.. బీకారి మిలియనీర్ అవుతాడు. ఇదంతా మార్కెట్ మాయాజాలం. ఇలాంటి మార్కెట్లలోనే ఇప్పుడు ఏకంగా 25 వేల కోట్ల విలువైన షేర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి ఎవరి చేతులు మారడం లేదు.. అలాగని వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. జస్ట్ ఉన్నాయంటే.. ఉన్నాయంతే.. ఇప్పుడు వీటిపైనే పలువురు ఇన్వెస్టర్లు.. కంపెనీలు ఫోకస్ చేశాయి. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డాయి.

స్టాక్స్‌, ప్రావిడెంట్‌ఫండ్స్, మ్యూచువల్‌ ఫండ్స్.. ఇన్వెస్టర్స్‌ ఇన్వెస్ట్‌ చేసే కొన్ని ప్లాట్‌ఫామ్స్..ఇలా వీటిలో ఇన్వెస్ట్‌ చేసి ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు కొందరు ఇన్వెస్టర్స్.. మరి వాటిని ఎవరికి పడితే వారికి ఇవ్వలేరు .. ఎట్ ది సేమ్‌ టైమ్ క్లెయిమ్‌ చేయలేరు.. దీంతో ఇలాంటి ఇన్వెస్టర్లను గుర్తించేందుక నెత్తి నోరు బాదుకుంటున్నాయి కంపెనీలు.. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్‌ అండ్ ప్రొటెక్షన్ ఫండ్.. ప్రభుత్వరంగ సంస్థనే లెండి.. ఈ సంస్థే ఇప్పుడీ లెక్కలు బయటకు తీసింది. 2023 మార్చి వరకు అక్షరాలా 25 వేల కోట్ల విలువైన క్లెయిమ్ చేయని షేర్లు ఉన్నట్టు గుర్తించింది. మరి వీటిని ఎందుకు క్లెయిమ్ చేయడం లేదు? దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లకు అవగాహన లేకపోవడం.. యస్.. చాలా మందికి స్టాక్‌ మార్కెట్లపై అవగాహన ఉండటం లేదు. వీరంతా ఫైనాన్షియల్ మార్కెట్‌కు కొత్త అనే చెప్పాలి. వీరంతా ఎప్పటికప్పుడు కాంటాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం లేదు. మరో రీజన్ అడ్రస్‌ చేంజ్.. వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది కానీ చాలా మంది తమ అడ్రస్ చేంజ్ అయ్యినప్పుడు అస్సలు అప్‌డేట్ చేయడం లేదు. దీంతో కంపెనీలు పంపించే డివిడెంట్‌ నోటీసులు.. అకౌంట్ స్టేట్‌మెంట్స్‌ వారికి చేరడం లేదు.


Also Read: How Select Best Car: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..?

వీటితో పాటు.. అకౌంట్స్‌ను ఉపయోగించకపోవడం.. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బట్ చాలా వరకు ఇవన్నీ ఇన్‌యాక్టివ్‌గా ఉంటున్నాయి. ఇది కూడా క్లెయిమ్ చేయకపోవడానికి ఒక రీజన్‌గా ఉంటుంది. ఇక ఇన్వెస్టర్లు మరణించడం కూడా క్లెయిమ్ చేయకపోవడానికి ఒక రీజన్.. అదేంటి.. వారి మరణిస్తే నామినీగా ఉన్నవారు క్లెయిమ్ చేసుకుంటారు కదా అని అనుకోకండి.. చాలా మంది నామినీలను పెట్టుకోకపోవడం.. ఒకవేళ నామినీగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నా.. ఆ ఇన్ఫర్మేషన్‌ను వారికి చేరవేయకపోవడం కూడా ఒక రీజన్‌.. ఇక లాస్ట్‌ది.. ఇప్పటికి కూడా చాలా మంది ఇన్వెస్టర్ల మధ్య ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిని డీమెటిరియలైజ్‌డ్‌ అకౌంట్స్‌గా కన్వర్ట్‌ చేసుకోలేదు.. దీంతో వారి అకౌంట్స్‌ను క్లెయిమ్‌ చేసుకోలేకపోతున్నారు.

సో ఇవన్నీ కారణాల వల్ల 25 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లు ఇప్పటికీ అలా మురిగిపోతున్నాయి. ఇది ఫైనాన్షియల్ సెక్టార్లలోని చాలా కంపెనీలకు గుదిబండగా.. ఓవరాల్‌గా ఫైనాన్షియల్‌ మార్కెట్ల ఎఫిషియన్సీకిడా ప్రతికూలంగా మారుతుంది అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కేవలం షేర్‌ మార్కెట్ల గురించే ఇప్పుడు ఇతర రంగాలపై ఓ లుక్కేద్దాం.. ఫస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్.. 2023 మార్చి 2023 వరకు అక్షరాలా 35 వేల కోట్ల విలువైన క్లెయి్‌మ చేయని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి.

Also Read: టయోటా లాండ్ క్రూయిజర్ కొత్త ఎడిషన్ లాంచ్.. ఆకట్టుకుంటున్న డిజైన్!

ఇన్సూరెన్స్‌ సెక్టార్‌ చూసుకుంటే.. ఓన్లీ ఎల్‌ఐసీలోనే క్లెయిమ్ చేయని పాలసీల విలువ 21 వేల 500 కోట్లు.. ఇందులో అడ్రస్ అప్‌డేట్ చేయకపోవడం.. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌పై సరైన అవగాహన లేకపోవడం.. పాలసీ డాక్యుమెంట్స్‌ను పొగొట్టుకోవడం ఇలా మిగిలిపోవడానికి కారణాలు.. ఇది కేవలం LICలో మాత్రమే.. ఇక ప్రైవేట్ సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సంబంధించిన డేటా అవెలబుల్‌గా లేదు కానీ.. ఉంటే ఆ లెక్కలు మరెంత కళ్లు చెదిరేలా ఉంటాయో..

నెక్ట్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్.. అదేనండి PF.. the employees provident fund organisationలో అయితే ఇలాంటి క్లెయిమ్‌ల విలువ 48 వేల కోట్లు.. బ్యాంకుల విషయానికి వస్తే.. అక్షరాలా 62 వేల కోట్లు విలువైన బ్యాంక్‌ డిపాజిట్లు అలాగే మురిగిపోతున్నాయి.. అన్ని బాగానే చెప్పారు.. మరి వీటిని క్లెయిమ్ చేసుకోవడం ఎలా? అది కూడా చెప్పండి అంటారా.. అయితే జాగ్రత్తగా వినండి.. ఇలాంటి వాటిని క్లెయిమ్ చేసుకోవడం చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్.. సో మనకు చాలా ఓపిక కావాలి.. ఎందుకంటే దీనికి చాలా పేపర్ వర్క్ అవసరం అవుతోంది.. లీగల్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం బయట దొరకడం లేదు.

Also Read: Kia Carens Facelift: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

అయితే ఈ మధ్య ఇలాంటి పనులు చేసి పెట్టేందుకు చాలా ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి.. వీరు ఇలాంటి వారికి సరైన గైడెన్స్ ఇస్తున్నారు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్‌ పరిశీలించి.. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్‌ ఏంటో సూచిస్తున్నారు. అయితే ఇంతా చేసినా కూడా సక్సెస్ రేషియో చాలా తక్కువనే చెప్పాలి.. అందుకే క్లెయిమ్ అయిన అమౌంట్ నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నాయి ఇలాంటి ఏజెన్సీలు.. అయితే టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది.. సో ఇప్పటికైనా ఇలాంటి క్లెయిమ్‌లను వెంటనే సాల్వ్ చేసేలా వ్యవస్థను డెవలప్‌ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదంతా కష్టం కాబట్టే.. ఇన్ని వేల కోట్ల రూపాయలు అలా ఊరికే పడి ఉంటున్నాయంతే.. సో మీరో.. మీకు తెలిసిన వాళ్లో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటే.. వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు త్వరపడితే మంచింది. ఆలస్యమైంది.. ఇప్పటికైనా అమృతంగా మార్చుకోండి. లేదంటే అది మరింత విషంగా మారడం తథ్యం.

Tags

Related News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Electronics ‘repairability index’: ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఇకపై రిపేరెబిలిటీ ఇండెక్స్.. త్వరలో చట్టం తీసుకురానున్న కేంద్రం!

Big Stories

×