EPAPER

Toyota Urban Cruiser Taisor launched : అద్భుతమైన డిజైన్, అదరగొట్టే ఫీచర్లతో టయోటా బడ్జెట్ కార్

Toyota Urban Cruiser Taisor launched : అద్భుతమైన డిజైన్, అదరగొట్టే ఫీచర్లతో టయోటా బడ్జెట్ కార్
Toyota Urban Cruiser Taisor
Toyota Urban Cruiser Taisor

Toyota Urban Cruiser Taisor launched : కార్ల వినియోగం దేశంలో భారీగా పెరిగింది. ప్రస్తుత కాలంలో బైకుల కంటే బడ్జెట్‌లో వచ్చే కార్లను కొనుగోలు చేయడం బెటర్ అని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. అందుకనే కార్ల కంపెనీలు కూడా మిడ్‌రేంజ్ ప్రైజ్‌లో వెహికల్స్‌ను తీసుకొస్తున్నాయి. కొనుగోలు దారులు కూడా మంచి బడ్జెజ్ కార్లు ఎప్పుడూ లాంచ్ అవుతాయని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టయోటా మోటర్స్ నుంచి అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీ వెహికల్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అదరగొట్టే ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.


దేశీయ మార్కెట్‌లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా టయోటా ఫార్చ్యునర్, టయోటా ఇన్నోవా వంటి వెహికల్స్ సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకితో టయోటా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు కలిసి మారుతి ఫ్రాంక్స్‌కు రీబ్యాడ్జ్‌ వెర్షన్‌గా.. టయోటా టైజర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి.

Also Read : పల్సర్ నుంచి మరో కొత్త బైక్.. ఏప్రిల్ 10న లాంచ్ కానున్న N250 మోడల్


ధర

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలుగా ఉంచింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, టయోటా టైజర్‌లు బ్యాడ్జ్‌- ఇంజినీరింగ్‌ ఆఫర్‌తో దాదాపు ఒకే విధమైన ఫీచర్లు కిలిగి ఉంటాయి. టైజర్ మాత్రం కొత్త స్టైలిష్ లుక్‌తో లాంచ్ అయింది.

డిజైన్‌

అర్బన్‌ క్రూయిజర్‌ డిజైన్ చూస్తే.. ఇది కొత్త లుక్‌ను కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మధ్య భాగంలో కూపే స్టైల్‌తో టయోటా లోగోతో గ్లేస్‌ బ్లాక్‌ను కలిగి ఉంది. కొత్త ట్విన్‌ LED DRL లతో ఫినిష్‌ అయిన కొత్త బోల్డ్‌ హనీకోంబ్‌ మెష్‌ గ్రిల్‌తో కారును చూడొచ్చు. లైట్‌ బార్‌ ద్వారా కనెక్టెడ్‌ ట్వీక్‌ LED టైల్‌లైట్‌లతో వస్తోంది. అలానే ఇందులో రీస్టైల్‌ చేసిన అల్లాయ్‌ వీల్స్‌, వెనుక విండ్‌ స్క్రీన్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఇంటీరియర్‌

అర్బన్‌ క్రూయిజర్‌ ఇంటీరియర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మారుతి ఫ్రాంక్స్ మాదిరిగానే 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంటుంది. ట్విన్‌ పాడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ట్రీట్‌మెంట్‌తో క్యాబిన్‌ టెక్‌ ఫీచర్లతో చూడొచ్చు. అలానే ఇందులో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు వైర్‌లెస్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌, DRL లతో కూడిన ఆటోమేటిక్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, 6- స్పీకర్ సౌండ్‌ సిస్టమ్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌-స్టాప్, ఇంకా రియర్‌ ఏసీ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నా యి.

Also Read : రికార్టుల మోత.. 48 లక్షల బైకులను సేల్స్ చేసిన హోండా..!

ఇంజిన్‌

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులోరెండు ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి.
అందులో ఒకటి 1.2 లీటర్‌ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌. ఈ ఇంజిన్‌ 89 bhp, 113 nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండో ఇంజిన్ 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 99 bhp, 148 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్‌ క్రూయిజర్‌ Taisorలో ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నాయి. నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ 5 స్పీడ్‌ AMTని కలిగి ఉంటుంది. టర్బో పెట్రోల్‌ ఇంజిన్ 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆప్షన్‌‌తో లభిస్తోంది. ఇందులో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ కూడా ఉంటుంది.

Related News

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×