EPAPER

​Top 10 Best Selling SUVs In June 2024: గత నెల జూన్‌లో దుమ్మురేపిన కార్ల సేల్స్‌‌.. టాప్ 10 జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఏదంటే?

​Top 10 Best Selling SUVs In June 2024: గత నెల జూన్‌లో దుమ్మురేపిన కార్ల సేల్స్‌‌.. టాప్ 10 జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఏదంటే?

​Top 10 selling SUVs in June 2024: ఈ మధ్య కాలంలో వాహన ప్రియులు ఎక్కువగా కార్లపై ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఎస్యూవీలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న కార్లు, ఇతర హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఈ ఎస్యూవీలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం భారతీయుల టేస్ట్‌కి తగ్గట్టుగా ఎస్యూవీలను మరింత స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రజెంట్ దేశంలో కార్ల సేల్స్ గణనీయంగా వృద్ధి చెందాయి. అయితే 2024 జూన్‌లో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 ఎస్యూవీల గణంకాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


టాటా మోటార్స్ దేశీయ మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తోంది. కొత్త కొత్త కార్లను పరిచయం చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అందులోనూ ఎస్యూవీ కార్లపై బాగా ఫోకస్ పెట్టింది. అయితే ఈ టాటా మోటార్స్ నుంచి విడుదలైన టాటా పంచ్ ఎస్యూవీ బాగా ప్రాచుర్యం పొందింది. 2024 జూన్ నెలలో సేల్ అయిన కార్ల జాబితాలో టాటా పంచ్ ఫస్ట్ ప్లేస్‌లో స్థానం సంపాదించుకుంది. అయితే ఒక్క ఎస్యూవీ విభాగంలోనే కాకుండా సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌ల కంటే కూడా టాటా పంచ్ అగ్రస్థానంలో ఉంది. జూన్ నెలలో టాటా పంచ్ కార్ల సేల్స్ అదిరిపోయాయి. గత జూన్ నెలలో టాటా పంచ్ 18,238 యూనిట్లు సేల్ అయ్యాయి. అదే గతేడాది 2023 జూన్‌లో కేవలం 10,990 యూనింట్లు మాత్రమే సేల్ అయ్యాయి. దీనిబట్టి చూస్తే టాటా పంచ్ సేల్స్ 65.95 శాతం వృద్ధి చెందిందనే చెప్పాలి.

టాటా పంచ్ తర్వాత ప్లేస్‌లో హ్యుందాయ్ క్రెటా రెండవ స్థానంలో ఉంది. 2024 జూన్ నెలలో 16,293 యూనిట్లు సేల్ అయ్యాయి. అదే గతేడాది 2023 జూన్ నెలలో 14,447 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని బట్టి చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది జూన్ సేల్స్ బాగా పెరిగాయనే చెప్పాలి. ఈ రెండు కంపెనీల తర్వాత మూడో ప్లేస్‌లో మారుతి సుజుకి ఉంది. ఈ కంపెనీకి చెందిన బ్రెజ్జా కార్లు 2024 జూన్ నెలలో 13,172 యూనిట్లు సేల్ అయ్యాయి.


Also Read:  మహీంద్రా ఎక్స్యూవీ కారుపై రూ. 2 లక్షల భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే?

దీంతో ఇది మూడో ప్లేస్ సంపాదించుకుంది. గతేడాది 2023 జూన్ నెలలో కేవలం 10,578 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. అంటే 2023 జూన్ నెలతో పోలిస్తే ఇది 24.52 శాతం అధికమనే చెప్పాలి. దీని తర్వాతి స్థానంలో స్కార్పియో ఉంది. ఈ జాబితాలో స్కార్పియో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో క్లాసిక్, స్కార్పియో-ఎన్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. కాగా 2024 జూన్‌లో స్కార్పియో 12,307 యూనిట్లు సేల్ కాగా 2023 జూన్‌లో కేవలం 8,648 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి.

ఐదో స్థానంలో టాటా మోటార్స్‌కి చెందిన టాటా నెక్సాన్‌ ఉంది. ఇది 2024 జూన్‌లో 12,066 యూనిట్లను అమ్మింది. అయితే గతేడాది 2023 జూన్‌లో కంపెనీ 13,827 యూనిట్లను సేల్ చేసింది. దీని బట్టి చూస్తే ఈ ఏడాది జూన్‌లో నెక్సాన్ సేల్స్ కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. వీటి తర్వాత హ్యుందాయ్ వెన్యూ, కాయా సోనెట్ కార్లు టాప్ 10 లిస్ట్‌లో 6, 7 ప్లేస్‌లలో ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 8వ స్థానంలో ఉంది. అలాగే మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ 9, 10 స్థానాల్ని కైవసం చేసుకున్నాయి.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×