Today Gold Rate: పసిడి ధరలు ఎంత లెవల్‌కి ఎదిగి పోతున్నాయంటే.. మాటల్లో చెప్పలేం.. ఒకప్పుడు ప్లాటినం.. బంగారంను చూసి ఎక్కిరించేది.. కానీ ఇప్పుడు బంగారం ప్లాటినం చూసి జాలిపడేలా అయింది పరిస్థితి. కారణం.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌కి అంత డిమాండ్ పెరగింది మరి. ప్రస్తుతం ప్లాటినం పది గ్రాములు సుమారు రూ.30,000 ఉండవచ్చు. కానీ బంగారం ధర మాత్రం రోజు రోజుకి పెరుగుతూ లక్ష మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇప్పుడు గోల్డ్‌కి ఉన్న క్రేజ్ డాలర్‌కి కూడా లేదు. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ.. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. 2005 నుంచి 2024 వరకు బంగారం ధర చూస్తే.. ఏకంగా 455% పెరిగి అందరిని ఆశ్చర్యానిరి గురిచేస్తుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
బంగారం ధరలు..
చెన్నైలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర ఏకంగా రూ. 81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.81, 320 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.
బెంగుళూరులో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.
కేరళలో బంగారం ధరలు పరిశీలిస్తే.. తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.
Also Read: పెరిగిన బంగారం ధరలు.. వెలవెలబోతున్న గోల్డ్ షాప్స్..!
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ చూస్తే..
హైదరాబాద్‌లో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద ట్రేడింగ్ లో ఉంది.
విజయవాడలో తులం పసిడి ధర రూ.81,170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో తులం పసిడి ధర రూ.81, 170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 410 ఉంది.
వెండి ధరలు పరిశీలిద్దాం..
చెన్నై, కేరళ లో కిలో వెండి ధర రూ.1,09,100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.1,00,100 ఉంది.
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,09,100 వద్ద కొనసాగుతోంది.