World Bank President David Malpass : ప్రపంచం ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తోందని హెచ్చిరంచారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్, ఐఎమ్ఎఫ్ కలిసి నిర్వహిస్తున్న వార్షిన సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం నుంచి 1.9 శాతానికి పడిపోయిన్టలు గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి పెద్ద సవాల్‌గా మారిందన్నారు.
ఒక్కో దేశంలో సమస్య ఒక్కో విధంగా ఉన్నట్లు చెప్పారు డేవిడ్ మల్‌పాస్. వీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతున్న మరో సమస్య అధిక రుణాలు అన్నారు. భారీగా రుణాలు తీసుకోవడం వాటికి వడ్డీలు అధికంగా పెరగడం మరో సమస్యగా మారిందన్నారు. కరెన్సీ బలహీనపడ్డంతో పరిస్థితిని మరింత దిగజార్జుతున్నాయని అన్నారు.
Leave a Comment