EPAPER

Best Selling Scooters: సేల్స్‌లో కింగ్‌లు.. ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్లు ఇవే!

Best Selling Scooters: సేల్స్‌లో కింగ్‌లు.. ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్లు ఇవే!

Best Selling Scooters: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి గల కారణంగా వాటి ధరలు కూడా అందుబాటులోకి రావడమే. ఇప్పుడు పెట్రోల్, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల మధ్య పెద్దగా తేడా ఏమి ఉండటం లేదు. ఈ క్రమంలో గత నెల జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.


TVS iQube
ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఈసారి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడో స్కూటర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో 15,210 యూనిట్ల ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించగా  గతేడాది జూన్‌లో కంపెనీ మొత్తం 14,462 యూనిట్లను విక్రయించింది. అంటే ఈసారి కంపెనీ మరో 748 యూనిట్లను విక్రయించింది. ఈ స్కూటర్ డిజైన్, దాని ఫీచర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. టీవీఎస్ ఐక్యూబ్ (2.2 kWh) వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,999గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది.

Also Read:Bajaj Freedom 125 CNG: స్పీడ్ పెంచిన బాజాజ్.. ఆగస్టు 15 న 77 సిటీల్లో ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్!


ఈ స్కూటర్ 2 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 75 కిలోమీటర్లు. 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్కూటర్‌లో ఉంటుంది. దీనిలో మీరు రెండు హెల్మెట్‌లను కలిపి ఉంచుకోవచ్చు. దీనిలో పొడవైన సీటు ఉంటుంది. ఇతర వస్తువులకు ఉంచడానికి అదనపు స్పేస్ కూడా ఉంటుంది. ఇది 17.78 సెం.మీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Ola S1
ఓలా గత నెలలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ S1ను 36,723 యూనిట్లను విక్రయించగా గత సంవత్సరం కంపెనీ 17,579 యూనిట్లను విక్రయించింది. ఈసారి ఓలా ఈ స్కూటర్‌ను 19,144 యూనిట్లను విక్రయించింది. జూన్ నెలలో ఈ స్కూటర్ మరోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కొంతకాలం క్రితం ఓలా సరసమైన S1 ను ప్రవేశపెట్టింది. ఇది కంపెనీ హై స్పీడ్ స్కూటర్ ఇందులో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. స్కూటర్ సాధారణ హ్యాండిల్‌బార్, LED లైట్‌తో వస్తుంది.

Also Read: LIC Scheme for Daughter: పాలసీ అదిరింది.. కూతురు పెళ్లికి ఎల్‌ఐసీ భారీ కట్నం!

Bajaj Chetak Electric
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు ఊపందుకుంటున్నాయి  . గత నెలలో కంపెనీ మొత్తం 13,620 యూనిట్లను విక్రయించగా గతేడాది కంపెనీ 7,080 యూనిట్లను విక్రయించింది. ఈసారి కంపెనీ మరో 9611 యూనిట్లను విక్రయించింది. చేతక్ క్లాసిక్ దాని డిజైన్ కారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. దీనికి డిజిటల్ కన్సోల్ ఉంది. ఇది కాకుండా స్కూటర్‌లో LED లైట్లు, డిజైనర్ టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇందులో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ.1.23 లక్షల నుండి రూ.1.47 లక్షల వరకు ఉంది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×