EPAPER

Upcoming SUV in August: కొత్త కార్లు వస్తున్నాయి.. డిజైన్ అదిరిపోయింది.. రేంజ్‌లో తగ్గేదే లేదు!

Upcoming SUV in August: కొత్త కార్లు వస్తున్నాయి.. డిజైన్ అదిరిపోయింది.. రేంజ్‌లో తగ్గేదే లేదు!

Upcoming SUV in August: దేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుంది. అందుకు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హొండా ఎలివేట్ వంటి ఎస్‌యూవీలు భారీగా అమ్ముడవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక వీటి యగం ముగిసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో క్రాస్‌ఓవర్, కూపే ఎస్‌యూవీల యుగం రాబోతుంది. టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ ఇప్పుడు లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. సీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఉండబోతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే 9 ఎస్‌యూవీలు ఉన్నాయి.


Citroen Basalt
సిట్రయెన్ C3 ఎయిర్‌‌క్రాస్ తర్వాత ఇప్పుడు కంపెనీ మరో SUV బసాల్ట్‌ను విడుదల చేయబోతోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్‌లకు పోటీగా ఉంటుంది. ఇది 2 ఆగస్టు 2024న విడుదల కానుంది. కారు పొడవు 4.3 మీటర్లు ఉంటుంది. కొత్త బసాల్ట్ సి సెగ్మెంట్‌లో విడుదల కానుంది. దీని డిజైన్ ఫోర్ డోర్ కూపే ఆధారంగా ఉంటుంది. దీని సీట్లు చాలా స్మూత్‌గా, వెంటిలేషన్‌గా ఉంటాయి. ఇది రోజు వినియోగంతో పాటు దూర ప్రయాణాలకు కంఫర్ట్‌గా ఉంటుంది. వెనుక ప్రయాణీకులకు కోసం ఎక్కువ స్థలం ఉంటుంది.

Also Read: యమహా నుంచి క్లచ్ లెస్ బైక్.. పిచ్చిరేపుతున్న స్పీడ్.. లాంచ్ ఎప్పుడంటే?


కొత్త బసాల్ట్ 1.2L 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. కొత్త ఇంజన్ అన్ని రకాల వాతావరణంలో మంచి పనితీరును ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఆశాజనకంగా ఉంది, త్వరలో ఈ కొత్త మోడల్ యొక్క EV వెర్షన్‌ను కూడా పరిచయం చేయవచ్చని వార్తలు కూడా వస్తున్నాయి. డీజిల్ ఇంజన్‌లో కొత్త బసాల్ట్‌ను తీసుకురావాలనే ఆశ ప్రస్తుతం లేదు.

Tata Curvv
టాటా మోటార్స్ ‘కర్వ్వ్ ఎస్‌యూవీ కూపే’ ఆగస్టు 7న దేశంలో విడుదల కానుంది. ఇంజన్ గురించి మాట్లాడితే Curvv 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 115 PS పవర్ రిలీజ్ చేస్తుంది. టెస్టింగ్ సయంలో అనేక సార్లు ఇది కనిపించింది. కర్వ్  అంచనా ధర రూ. 11-12 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.

కొత్త కూపే కర్వ్‌లో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇందులో నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ హ్యుందాయ్ క్రెటాలో లేదు. కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా రానుంది. మీడియా నివేదికల ప్రకారం టాటా కర్వ్ EVని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లాంచ్ చేయవచ్చు. ఇందులో40.5 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.

Also Read: TVS Ronin Parakram Custom Bike: టీవీఎస్ సూపర్ ప్లాన్.. కార్గిల్ విజయ్ దివస్‌‌కి గుర్తుగా కొత్త బైక్!

ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 465 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది కాకుండా దాని టాప్ మోడల్ 55 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీని సింగిల్ ఛార్జ్ రేంజ్ 550 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మాత్రమే కాదు, కర్వ్ అనేది acti.ev ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×