EPAPER

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

NAMX HUV Hydrogen Powered SUV: ప్రముఖ ఇటాలియన్ కార్ డిజైనర్ పినిన్ఫారినా, NamX అనే ఆఫ్రో-యూరోపియన్ కంపెనీ సరికొత్త హైడ్రోజన్ కారును ఆవిష్కరించాయి. HUV అని పిలువబడే తొలి హైడ్రోజన్ SUVని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బయటకు తీసే హైడ్రోజన్ ప్యుయెల్ క్యాప్సూల్ సిస్టమ్‌ కలిగి ఉన్న కారు ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. ప్రపంచ ఆటో మోబైల్ కంపెనీకి ఈ కారు ఓ దిక్సూచిగా మారబోతోందని తయారీ కంపెనీ భావిస్తోంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కార్లకంటే ఇది అత్యుత్తమ కారుగా కంపెనీ అభివర్ణించింది.


NamX కాన్సెప్ట్ ప్రత్యేకత ఏంటి?

కార్ల వినయోగదారులలో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెరుగుతోంది. కాలుష్య రహితకార్లను వినియోగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. ఈకార్లతో ఎలాంటి హానికరమైన వాయువులు వెలువడవు. గ్లోబల్ వార్మింగ్‌  వ్యతిరేకంగా పోరులో ఈ కార్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ డిజైన్పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనం తయారీలో కార్బన్ 45% వరకు ఉంటుంది. డీజిల్, పెట్రోల్  కార్ల కంటే తక్కువే.. అయినప్పటికీ పూర్తి స్థాయి పర్యావరణహితమైన కారు కాదు. ఈ నేపథ్యంలో  హైడ్రోజన్ కారు సరికొత్త మోడల్ NamXని విడుదల చేశారు.


Also Read: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

ఈ కారు మోడల్ ఎలక్ట్రిక్ కారులా ఉన్నా, ఎలాంటి కార్బన్ డై ఆక్సైడ్ ను  విడుదల చేయదు. బ్యాటరీ స్థానంలో ప్యూయెల్ క్యాప్సుల్స్ వినియోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్  స్టేషన్ల సంఖ్య తక్కువగా ఉన్నది. అందుకే ఈ కంపెనీ క్యాప్‌ ఎక్స్ హైడ్రోజన్ క్యాప్సూ ల్స్ ను తయారు చేసింది. కారు వెనుక భాగంలో 6 హైడ్రోషన్ ఫ్యూయెల్ క్యాఫ్సుల్స్ ఉంటాయి. ఒక్కో క్యాఫ్సుల్ 800 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి.  ఈ క్యాప్సూల్‌లను ఎక్కడ హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్‌ ఉంటే అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు.

2025 Q4లో మార్కెట్లోకి వచ్చే అవకాశం

NamX HUV రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కారును రెండు వేరియెంట్లలో విడుదలచేయనుంది. రియర్-వీల్ డ్రైవ్‌ ట్రెయిన్, 300 hpతో ఎంట్రీ లెవల్ వేరియంట్ రానుంది. ఈ కారు 6.5 సెకన్లలో 0 నుండి 100 km/h వరకు వేగాన్ని అందుకుంటుంది. టాప్-స్పెక్ GTH వెర్షన్ ఫోర్ వీల్ డ్రైవ్, 550 hpని కలిగి ఉంటుంది. ఇది 4.5 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకుంటుంది.  ఈ HUV ధర రూ. 53,11,788 నుంచి రూ.77,63,382 వరకు ఉంటుందని అంచనా. ఈ కార్లు Q4 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హైడ్రోజన్ ను ఇంధనంగా ఎలా వాడుతారు?

హైడ్రోజన్‌ తో నడిచే కార్లలో ఫ్యూయెల్ సెల్‌ను వినియోగిస్తారు. ఇది బ్యాటరీతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫ్యూయెల్ సెల్‌ లోని హైడ్రోజెన్‌ గాలిలో ఉండే‌ ఆక్సిజన్‌తో కెమికల్ రియాక్షన్ జరుపుతుంది. దీంతో విద్యుత్ శక్తిగా మారి కార్లు నడుస్తాయి. ఈ ఇంధనం పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. భూమ్మీద ఉన్న మూలకాల్లో హైడ్రోజన్ విస్తారంగా ఉంటుంది. దాన్ని తక్కువ ఖర్చుతో ఇంధనంగా మార్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×