EPAPER

Mahindra XUV 3XO: టాటా పంచ్‌కు బిగ్ షాక్.. మొదటి స్థానంలో మహీంద్రా.. భారీగా పెరిగిన డిమాండ్!

Mahindra XUV 3XO: టాటా పంచ్‌కు బిగ్ షాక్.. మొదటి స్థానంలో మహీంద్రా.. భారీగా పెరిగిన డిమాండ్!

Mahindra XUV 3XO: దేశంలో SUVల డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. ఎక్కుమంది కొనుగోలుదారులు వీటినే కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు. మొత్తం కార్ల విక్రయాలలో 50 శాతానికి పైగా SUV సెగ్మెంట్ మాత్రమే వాటాను కలిగి ఉంది. గత నెలలో ఈ సెగ్మెంట్ అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే టాటా పంచ్ అగ్రస్థానాన్ని సాధించింది. అయితే డిమాండ్ పరంగా మహీంద్రా XUV 3XO అన్ని కార్లను మించిపోయింది. ఒకవైపు టాటా పంచ్ 65.95 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 18,238 యూనిట్ల SUVలను విక్రయించింది.


అదే సమయంలో మహీంద్రా XUV 3XO వార్షిక ప్రాతిపదికన 66.86 శాతం పెరుగుదలతో 8,500 యూనిట్ల SUVలను విక్రయించింది. ఈ విధంగా చూస్తే గత నెలలో అంటే జూన్ 2024లో, Tata Punch కంటే Mahindra XUV 3XOకి డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే టాటా పంచ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 SUVల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా మహీంద్రా XUV 3X0 పదవ స్థానంలో ఉంది. మహీంద్రా XUV 3X0 ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

SUV పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మహీంద్రా XUV 3X0 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 110bhp పవర్‌ని, 200Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 117bhp పవర్, 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా కారులో ఇవ్వబడిన 1.2-లీటర్ TGDI టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 130bhp పవర్‌ని, 250Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కస్టమర్లు కారులో ఆటోమేటిక్, మాన్యువల్ గేర్‌బాక్స్‌ల ఆప్షన్ పొందుతారు.


Also Read: ఎలక్ట్రిక్ హైబ్రిడ్ స్కూటర్.. 300 కిమీ రేంజ్.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

కారు లోపలి భాగంలో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా భద్రత కోసం కారులో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ADAS టెక్నాలజీతో కూడిన 360 డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. SUV ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 7.49 లక్షల నుండి రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

Tags

Related News

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×