EPAPER

Aadhaar Update Online: ఆధార్ అప్‌డేట్.. జూన్ 14న లాస్ట్.. భారీ మూల్యం తప్పదా?

Aadhaar Update Online: ఆధార్ అప్‌డేట్.. జూన్ 14న లాస్ట్.. భారీ మూల్యం తప్పదా?

Aadhaar Update Online: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువును పొడిగించింది. ఈ కొత్త గడువు ప్రకారం వినియోగదారులు ఇప్పుడు జూన్ 14, 2024 వరకు తమ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ నెల ప్రారంభమై రోజులు కూడా దగ్గరపడుతున్నాయి. భారతీయలు తమ ఐడెంటి ప్రూఫ్ (POI) ,ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇప్పుడు దాదాపు 10 రోజులు మిగిలి ఉన్నాయి.


ఇప్పుడు ఆధార్ ఉన్నవారు జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో తమ ఆధార్ కార్డ్‌లోని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA)లను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI, POA డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. 5-15 సంవత్సరాల వయస్సులో తన బ్లూ ఆధార్ కార్డ్‌లో పిల్లల బయోమెట్రిక్ వివరాలను కూడా అప్‌డేట్ చేయాలి.

Also Read: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!


ఆధార్‌లో మీరు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ/వయస్సు, జెండర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రెస్, రిలేషిప్ స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్ అనేది భారతీయ నివాసులందరికీ జారీ చేయబడిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్. ఇది ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలను సేఫ్‌గా చేయడానికి అవసరం. ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం మోసపూరిత కార్యకలాపాలకు దూరంగా ఉండొచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి?

  • దీనికోసం ముందుగా UIDAI వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి. తర్వాత మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోండి.
  •  తర్వాత మీరు అప్‌డేట్ ఫీచర్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు మై ఆధార్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెను నుండి అప్‌డేట్ యువర్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డేటాను ఫీల్ చేసిన తర్వాత అప్‌డేట్ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మీ UID నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ మీరు పంపిన OTPని ఇవ్వాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత లాగిన్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ పేరు అడ్రెస్, పుట్టిన తేదీని అప్‌డేట్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఆధార్‌లో చేయాలనుకుంటున్న అప్‌డేట్ గురించి సరైన సమాచారాన్నిఎంటర్ చేయండి.
  •  మీరు అన్ని ఛేంజెస్ చేసిన తర్వాత, సడ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి, మీ అప్‌డేట్ రిక్వస్ట్ ఇవ్వడానికి అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసిన ఫోటోలను అప్‌లోడ్ చేయండి.
  • చివరగా మీరు ఈ ఫారమ్‌ను పూర్తి చేసినప్పుడు SMS ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది. దీనితో మీరు మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు.

ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డ్, మార్క్‌షీట్,మ్యారేజ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ మొదలైనవి.
  • బ్యాంక్ స్టేట్‌మెంట్ , విద్యుత్ లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లు, పాస్‌పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, అద్దె స్లిప్, ప్రభుత్వం జారీ చేసిన ID కార్డ్‌లు మొదలైనవి .

Also Read: మారుతీ నుంచి డ్రీమ్ సిరీస్ కార్లు.. బుకింగ్స్ స్టార్ట్!

మీరు జూన్ 14, 2024 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో మీ ఐడెంటిటీ, అడ్రస్‌లను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ గడువు తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేస్తే మీరు దాని కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×