EPAPER

Tata Curvv 2024: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. ఆగస్టు 7 న లాంచ్.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Tata Curvv 2024: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. ఆగస్టు 7 న లాంచ్.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Tata Curvv 2024: టాటా మోటార్స్ తన మొదటి కూపే SUV కర్వ్‌ను ఆగస్టు 7న విడుదల చేయనుంది. ఇప్పుడు దీని లాంచ్‌కి సంబంధించిన కొత్త వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. తాజాగా దీని ఇంజన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. అలానే కలర్ వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మీరు కర్వ్ SUVని మొత్తం 6 కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయచ్చు. ఇవన్నీ సింగిల్ టోన్ కలర్స్‌గా ఉంటాయి. అయితే దీనిని డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా లాంచ్ చేయవచ్చు.  మీరు దీన్ని కొనుగోలు చేయాలంటే పూర్తి వివరాలు తెలుసుకోండి.


టాటా కర్వ్ లాంచ్ చేయబడే ఆరు కలర్స్ న్యూ గోల్డ్, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, ఒపెరా బ్లూ, ప్రిస్టైన్. ఇది ICE, EV మోడళ్లలో విడుదల చేయనుంది. టాటా మోటార్స్ దీనిని జూలై 19 న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. కంపెనీ కర్వ్ ICE, EV మోడల్‌లను పరిచయం చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లాంచ్ కానుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ భారతీయ ఎస్‌యూవీ రంగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా నిలిచిందన్నారు.

Also Read: Cheapest 7 Seater Cars: ఫ్యామిలీ కార్లు.. ఎక్కువ మంది కూరోవచ్చు.. తక్కువ ధరకే!


ఒరిజినల్ సియెర్రా, సఫారి, నెక్సన్, పంచ్, హారియర్ వంటి మోడల్‌లు కూడా దీనికి నిదర్శనం. మా పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేయడానికి మేము దేశంలోని మొట్టమొదటి కూపే-స్టైల్ SUVని కర్వ్ రూపంలో పరిచయం చేసాము. టాటా కర్వ్ డిజైన్, ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ కర్వ్ కూపే-స్టైల్ SUV ఏరోడైనమిక్స్ చాలా భిన్నంగా ఉంటాయి.

దాని సహాయంతో ఇది వేగాన్ని త్వరగా అందుకుంటుంది. కర్వ్ వాలు గాలికి వ్యతిరేకంగా వేగంగా కదలడానికి సహాయపడుతుంది. ఇది పెద్ద వీల్స్, పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కంపెనీ దీన్ని రెండు కొత్త కలర్ షేడ్స్‌లో తీసుకొస్తుంది. వర్చువల్ సన్‌రైజ్ దాని ఎలక్ట్రిక్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో గోల్డ్ ఎసెన్స్ థీమ్ పెట్రోల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది.

దేశీయ ప్రజలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. లాంగ్ డ్రైవ్‌లకు కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. కర్వ్ దాని SUV కూపే డిజైన్‌తో లెటెస్ట్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కారు ప్రీమియం అప్పీల్‌పైలో వస్తుంది. క్యాబిన్‌లో ఫస్ట్-ఇన్-క్లాస్ టెక్నాలజీ, ఫీచర్లు ఉంటాయి. దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పెద్ద బూట్ స్పేస్‌ ఉంటుంది.

పెట్రోల్-డీజిల్ అలాగే ఎలక్ట్రిక్ మోడళ్లలో కర్వ్ మార్కెట్‌లోకి వస్తుంది. దీని మెకానికల్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఇంకా ఎలాంటి డేటా వెల్లడి కాలేదు. దీనికి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 125 PS పవర్, 225 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 115 PS పవర్, 260 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది.

Also Read:7 Seater Cars At Half Price: హైదరాబాద్‌లో సగం ధరకే కార్లు.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. సింపుల్‌గా కొనేయండి!

దీని ఎలక్ట్రిక్ వెర్షన్ అత్యుత్తమ ఇన్-క్లాస్ డ్రైవింగ్ రేంజ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. Nexon EV కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ కర్వ్‌లో ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. టాటా నెక్సాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. అలానే ఇది అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది.

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×