EPAPER

September New Financial Rules: సెప్టెంబర్ 1 నుంచి మారబోతున్న సామాన్యుడి జీవితం.. ఆధార్, క్రెడిట్ కార్డ్, గ్యాస్ సిలిండర్..

September New Financial Rules: సెప్టెంబర్ 1 నుంచి మారబోతున్న సామాన్యుడి జీవితం.. ఆధార్, క్రెడిట్ కార్డ్, గ్యాస్ సిలిండర్..

September New Financial Rules: భారతదేశంలో సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే కీలక ఆర్థికాంశాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రాబోతున్నాయి. ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ల ధరల నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు, ఆధార్ కార్డ్ అప్డేట్ వరకు అన్నింట్లో మార్పులు రావడంతో ప్రజలు ఇకపై తమ బడ్జెట్ మేనేజ్‌మెంట్ లో కూడా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి.


కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి తీసుకొచ్చే మార్పులు ఇవే..

ఆధార్ కార్డ్ ఉచిత అప్డేట్: భారత దేశంలో మూలిక గుర్తింపు కార్డు అయిన ఆధార్ కార్డు అప్డేట్ ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఎడిఎఐ) తప్పని సరి చేసింది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ని కనీసం పదేళ్ల కోసారి అప్డేట్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డ్ అప్డేట్ సేవను ఉచితంగా.. కేవలం సెప్టెంబర్ 14, 2024 వరకు మాత్రమే పొందవచ్చు. ఇప్పటికే గత సంవతరం నుంచి ప్రభుత్వం ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సేవను మూడు సార్లు పొడిగించింది. ఈ డెడ్ లైన్ సెప్టెంబర్ 14 వరకు మాత్రమే ఉంటుంది.

ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటే సెప్టెంబర్ 14 లోగా చేసుకోండి. ఆ తరువాత చెల్లింపులు ఉంటాయి. అయితే చాలా మంది అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు. అలా అడ్రస్ అప్డేట్ చేసుకోనివారికి.. ప్రభుత్వ పథకాల లాభాలు అందవు. అలాగే ఎక్కడైనా మీరు అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు చూపించాలనుకున్నా సమస్యలు ఎదురవుతాయి.


ఎల్ పిజి సిలిండర్ ధర (వంట గ్యాస్ సిలిండర్ ధర): సెప్టెంబర్ ప్రారంభం కాగానే వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగనున్నాయని సమాచారం. ఎన్నికలు ముగిశాయి గనుక.. ప్రజల నుంచి అధిక పన్నులు, నిత్యావసరాల ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతాయి.

ఎటిఎఫ్, సిఎన్‌జి, పిఎన్ జి ధరలు : సెప్టెంబర్ నెలలో ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ అంటే విమానాల్లో ఉపయోగించే ప్రత్యేక పెట్రోల్(ఎటిఎఫ్) ధర కూడా పెరుగనుంది. దీంతో విమాన టికెట్లు కూడా పెరుగుతాయి. అలాగే సిఎన్ జి ఎఎన్ జి ధరలు పెరుగనున్నాయి. ఈ పెరుగదలతో రవణా ఖర్చు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పైపైకే సాగుతాయి.

క్రెడిట్ కార్డ్ నియమాల్లో మార్పు: క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు ఇకపై నిబంధనల్లో మార్పును గమనించాలి. హెచ్ డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డుల లావాదేవీకు రివార్డ్ పాయింట్స్ లో ఇకపై పరిమితి ఉంటుంది. అలాగే ఐడిఎఫ్‌సి బ్యాంకు పేమెంట్ షెడ్యూల్ లో కూడా మార్పులు ఉంటాయి. ఈ మార్పుల ప్రభావం.. కార్డ్ హోల్డర్లు వాటిని ఉపయోగించి సాధించే రివార్డ్స్ పై ఉంటుంది.

ఫ్రాడ్ కాల్స్ పై కొరడా: సాధారణంగా అందరికీ ప్రొమోషనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కంపెనీ ఆఫర్, ఈ కంపెనీ ఆఫర్ అని.. అలాగే కొందరు సైబర్ క్రిమినల్స్ ప్రజలకు ఫోన్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తుంటారు. ఇకపై ఇలా ఒక కంపెనీ నుంచి స్పామ్ కాల్స్ కానీ, మోసపూరితంగా చేసే కాల్స్ కానీ రావడం జరగదు. అలాంటి కాల్స్ రాకుండా టెలీకామ్ కంపెనీలకు ప్రభుత్వ నియంత్రణా సంస్థ ట్రాయ్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా టెలీ మార్కెటింగ్ చేయాలనుకుంటే బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా వారిని బ్లాక్ చేయాలని.. సెప్టెంబర్ 30 లోగా చర్యలు తీసుకోవాలని అదేశించింది.

Also Read: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!

Related News

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Train Tickets Cancel: కౌంటర్‌లో కొన్న రైలు టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడం ఎలా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి చాలు!

Gold and Silver Prices: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Big Stories

×