Big Stories

SBI: ఎస్‌బీఐ సర్వర్‌ డౌన్‌.. ఈ బ్యాంక్ ఇక మారదా?

sbi

SBI: మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే ఆ కష్టాలు ఎలా ఉంటాయో మీకు బాగా తెలిసే ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లు నమ్మకపోవచ్చు కానీ.. ఎస్బీఐ ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్స్ ఎంతగా వేధిస్తుంటాయో బాధితులకే తెలుసు. కార్డు స్వైప్ చేస్తే సర్వర్ డౌన్ అంటుంది. యూపీఐ పేమెంట్ చేద్దామంటే సర్వర్ నాట్‌వర్కింగ్ అని హ్యాండ్ ఇస్తుంది. ఇలా అప్పుడప్పుడు కాదు.. ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులకు ఓపికెక్కువ ఉండాలి.

- Advertisement -

అసలే ఏప్రిల్ ఫస్ట్. కొత్త ఫైనాన్సియల్ ఇయర్ స్టార్టింగ్. బ్యాంకులు అన్‌అఫిషియల్‌గా మూతపడ్డాయి. ఆన్‌లైన్ సేవలూ నిలిచిపోయాయి. ఏదో ఏప్రిల్ 1 కాబట్టి ఇలా ఉందిలే.. మర్నాటికల్లా అంతా సెట్ అవుతుందిలే అనుకుంటే.. ఆదివారమూ సర్వర్ పని చేయలేదు. కనీసం మండే నుంచైనా నో ప్రాబ్లమ్ అనుకుంటే.. సోమవారమూ ఎస్బీఐ సర్వర్ సతాయించింది. తరుచూ మొండికేస్తోంది. దీంతో, సోషల్ మీడియా వేదికగా కస్టమర్లు ఎస్బీఐని కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు. ఆన్‌లైన్ సేవలు వర్క్ అవట్లేదంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

యూపీఐ లావాదేవీలు, నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌.. ఇలా SBIకి చెందిన అన్నిరకాల ప్లాట్‌ఫామ్స్‌లోనూ సమస్యలు వస్తున్నట్టు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీన ఆన్‌లైన్‌ సేవలకు అధికారికంగా స్వల్ప విరామం ప్రకటించింది ఎస్బీఐ. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. వార్షిక ఖాతాల ముగింపు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, ఆ తర్వాత కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవలేదు. ఎస్బీఐ సేవల్లో పలు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా తెగ వర్రీ అవుతున్నారు యూజర్లు. ఇంత జరుగుతుంటే.. SBI మాత్రం తనకేం తెలీనట్టు స్పందించట్లేదు. ప్రభుత్వ బ్యాంకా.. మజాకా!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News