Big Stories

SBI Amrit kalash Scheme : ఎస్‌బీఐ అందిస్తున్న బంపర్ ఆఫర్.. మంచి వడ్డీరేట్లు.. ‘అమృత్‌ కలశ్‌’ పొడిగింపు

SBI Amrit kalash Scheme

SBI Amrit kalash Scheme : ఎస్‌బీఐ అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమ్.. అమృత్‌ కలశ్‌. సాధారణంగా డిపాజిట్లపై బ్యాంకులు అందించే వడ్డీరేట్లు 5, 6 శాతం కంటే ఎక్కువ ఉండవు. కాని, అమృత్‌ కలశ్‌ స్కీమ్ కింద మాత్రం ఎస్‌బీఐ 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక సీనియర్‌ సిటిజన్లకైతే 7.6 శాతం వడ్డీ చెల్లిస్తోంది. రూ.2కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

- Advertisement -

ఈ పథకం కాలవ్యవధి 400 రోజులు.. అంటే అటుఇటుగా 13 నెలలు. ఈ ఆఫర్ బాగుండడంతో.. ఇన్వెస్టర్లు తమ సేఫ్ రిటర్న్స్ కోసం అమృత్‌ కలశ్‌ పథకంలో పెడుతున్నారు. ఆదరణ బాగుండడంతో.. మరికొన్ని రోజుల పాటు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

- Advertisement -

నిజానికి 400 రోజుల కాలవ్యవధితో ఉన్న ఈ స్కీమ్‌ 2023 మార్చి 31తో ముగిసింది. తాజాగా ఈ స్కీమ్‌ను పునరుద్ధరించింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం ఈ పథకం జూన్‌ 30 వరకు అందుబాటులో ఉండనుంది. అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అమృత్‌ కలశ్‌ పథకం కింద వచ్చే వడ్డీపై  ఆదాయ పన్ను చట్టం ప్రకారం TDS కట్ చేస్తారు. షార్ట్ టర్మ్ అండ్ సేఫ్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి అమృత్‌ కలశ్‌ పథకం చాలా బెస్ట్. పైగా ఏదైనా అత్యవసర సమయంలో డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే డిపాజిట్ చేసిన అమౌంట్‌పై లోన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉండడంతో.. అమృత్‌ కలశ్‌ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడిదారులు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News