Big Stories

RS 2000 Note : నేటి నుంచి బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడికి అవకాశం.. నిబంధనలివే..?

RS 2000 Note : నేటి నుంచి బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. తొలి రోజు బ్యాంకుల ముందు భారీగా క్యూలైన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2016లో నోట్ల రద్దు చేసినప్పుడు జనం బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఖాతాదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. బ్యాంకుల వద్ద క్యూలైన్ లో కొందరు వ్యక్తులు చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

సమ్మర్ సీజన్ కావడంతో బ్యాంకుల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. కస్టమర్లకు నీటి సౌకర్యం కల్పించాలని సూచనలు చేసింది. నోట్లు ఎక్స్ ఛేంజ్ చేసుకోవడానికి, డిపాజిట్ కు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 30 వరకు 2 వేల నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎలాంటి బ్యాన్ లేదని తెలిపింది. ఎవరైనా 2 వేల నోట్లు ఇస్తే షాపుల్లో గానీ ఇతర వాణిజ్య సంస్థల్లోగానీ తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు.

- Advertisement -

ప్రస్తుతం దేశంలో ఇతర డినామినేషన్ల రూపంలో తగినంత నగదు లభ్యత ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. అటు వెయ్యి నోటు మళ్లీ వస్తుందన్న విషయంపై శక్తికాంత్ దాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి వెయ్యి నోటుపై ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. ప్రజలు తమ 2 వేల నోటును బ్యాంకుల్లో ఎక్స్ ఛేంజ్ చేసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు సమర్పించాలని పనిలేదన్నారు. ఒక వ్యక్తి రోజుకు 10 నోట్లను అంటే రూ. 20 వేలు మార్పిడి చేసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News