EPAPER

Royal Enfield Guerrilla 450 Leaks: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మతిపోగొట్టే బైక్.. లుక్ నెక్స్ట్ లెవల్!

Royal Enfield Guerrilla 450 Leaks: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మతిపోగొట్టే బైక్.. లుక్ నెక్స్ట్ లెవల్!

Royal Enfield Guerrilla 450 Leaks: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎప్పటి నుంచో కంపెనీ పవర్‌ఫుల్ బైక్ గెరిల్లా 450 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. ఈ బైక్ జూలై 17 న విడుదల కానుంది. ఈ లాంగ్ రూట్ బైక్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. దీన్ని దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బైక్‌తో గుంతని రోడ్లు, పర్వతాలపై సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. దీని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది వెనుక నుండి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 లాగా కనిపిస్తుంది. బైక్ చాలా బోల్డ్ లుక్, ముందు వైపు నుండి స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది.


Also Read: టాటా పంచ్‌కు బిగ్ షాక్.. మొదటి స్థానంలో మహీంద్రా.. భారీగా పెరిగిన డిమాండ్!

ప్రస్తుతం కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 డెలివరీ తేదీ, ధరను వెల్లడించలేదు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ రూ.3 లక్షలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ పరంగా ఈ కూల్ బైక్ రెండు టైర్లకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ మ్యాప్ ఫీచర్ ఉంటుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, స్టైలిష్ రౌండ్ లైట్‌తో వస్తుంది. ఇందులో రెండు వేరియంట్‌లు ఉంటాయి.


గెరిల్లా 450లో లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంగ్ రూటుల్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తోంది. ఇది త్వరగా వేడెక్కదు, అధిక మైలేజీని అందిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ బైక్ 30 kmpl మైలేజీని ఇస్తుంది. ఇది 17 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ కలిగి ఉంటుంది. బైక్‌కు LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్ లభిస్తాయ. ఈ హై ఎండ్ బైక్ 825 మిమీ సీట్ హైల్‌ను పొందవచ్చు.

Also Read: ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. బెస్ట్ బైకులు ఇవే!

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సాలిడ్ బైక్‌లో కంపెనీ పవర్‌ఫుల్ 452సీసీ ఇంజన్ పవర్‌ట్రెయిన్‌ను అందిస్తుంది. ఇది 40.02 Ps పవర్, 40 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది డాషింగ్ లుక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్ నావిగేషన్, డ్యూయల్ కలర్ టోన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 క్రోమ్ ఫినిషింగ్, నేక్డ్ లుక్‌ను పొందుతుంది. ఈ లుక్‌లో బైక్‌పై ఫెయిరింగ్‌లు లేదా డోమ్ కవర్ ఉండవు. ఈ బైక్‌లో సింగిల్ పీస్ సీటు ఉంది. ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుంది. ఈ బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌తో వస్తుంది.

Tags

Related News

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

×