EPAPER

First Hybrid Version from Porsche 911: పోర్షే 911 నుంచి మొదటి హైబ్రిడ్ వెర్షన్‌.. 312 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!

First Hybrid Version from Porsche 911: పోర్షే 911 నుంచి మొదటి హైబ్రిడ్ వెర్షన్‌.. 312 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!

Porsche 911: జర్మన్ స్పోర్ట్స్ కార్ మేకర్ పోర్షే 911 మొదటి హైబ్రిడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. పోర్స్చే 911 కారుకు 61 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పోర్స్చే 911 Carrera GTS వేరియంట్ డిజైన్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా ఇది ఇంతకముందు కంటే చాలా పవర్‌ఫుల్‌గా తయారు చేశారు. ఇది 7వ జనరేషన్ మోడల్‌ కంటే ఊహించని టెక్నికల్ మార్పులతో రానుంది.


కొత్త పోర్స్చే 911 GTS 3.6-లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. T-హైబ్రిడ్ అని పిలువబడే హైబ్రిడ్ సిస్టమ్, పోర్స్చే Le Mans-విన్నింగ్ 919 హైబ్రిడ్ రేస్ కారు నుండి టెక్నాలజీని తీసుకొన్నారు. కొత్త Porsche 911 Carrera GTSలో కంపెనీ ఎలాంటి అప్‌గ్రేడ్‌లను అందించిందో తెలుసుకుందాం.

Also Read: అదిరిపోయే న్యూస్.. త్వరలో TATA చీపెస్ట్ పంచ్ SUV లాంచ్!


Porsche 911 Carrera GTSలో ఉన్న హైబ్రిడ్ సిస్టమ్ ప్లగ్-ఇన్ కాదు అందుకే మీరు కారులో పూర్తి స్థాయి EV మోడ్‌ను చూడలేరు. ఈ కారు 3.6 లీటర్ 6 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో జతచేయబడిన పోర్స్చే  T హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కారు ఇంజన్ టర్బోచార్జర్‌లో మోటారు ఉంది. ఇది చాలా స్పీడ్‌గా ఇంజన్‌కు బూస్ట్‌ను ఇస్తుంది. సెకండ్ మోటారు 8 స్పీడ్ డ్యూయల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈపోర్స్చే 911 మొత్తం 541PS పవర్ రిలీజ్ చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్  గంటకు 312 కిలోమీటర్లు.

Porsche 911 Carrera GTS అవుట్‌పుట్‌ను 60 bhp, 40 Nm టార్క్‌తో పెంచుతుంది. ఇది ట్విన్-టర్బో 3.0-లీటర్ ఇంజన్‌తో అమర్చబడింది. కొత్త ఫ్లాట్-సిక్స్ ఇంజన్ 479 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 571 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 54 bhp, 151 Nm టార్క్ ఎక్స్‌ట్రా బూస్ట్‌ను అందిస్తుంది. దీని కారణంగా 6500 RPM వద్ద 534 bhp కలిపి పవర్ అవుట్‌పుట్ వస్తుంది. ఇందులో కాంపాక్ట్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్నాయి.

Also Read: ఈ ఏడాది రాబోతున్న కొత్త కార్లు.. టాప్ -10 ఇవే

Porsche 911 Carrer కూడా పాత మోడల్‌ను పోలి ఉంటుంది కానీ కారు డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. కొత్త పోర్స్చే 911 కారెరా GTSలో మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు కనిపిస్తాయి. దీనితో పాటు కారులోని ఎయిర్ ఫ్లాప్‌లు కూడా ఇంతకముందు కంటే పెద్దవి. ఇది మాత్రమే కాదు మీరు ఇప్పుడు కారులో యాక్టివ్ ఎయిర్ ఇన్‌టేక్‌లను చూడవచ్చు. అంటే కారు ఇంజన్‌కు గాలి అవసరమైనప్పుడు మాత్రమే ఈ ఎయిర్ ఫ్లాప్‌లు ఓపెన్ అవుతాయి. మీరు కారులో స్టాండర్డ్ స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను చూడవచ్చు. దీని కారణంగా ఈ కారు ఇతర కార్ల కంటే సులభంగా గుర్తించవచ్చు.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×