EPAPER

PayTM Crisis | పేటియం ఉపయోగిస్తున్నారా?.. అకౌంట్ ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు పాటించండి..

PayTM Crisis | మీలో చాలామంది.. ఫోన్లలో PayTM ఉపయోగిస్తూ ఉంటారు. నోట్ల రద్దు తరువాత యుపిఐ చెల్లింపుల విధానం వచ్చింది. ఆ యుపిఐ చెల్లింపులను ప్రజలకు చేరువ చేసిన మొదటి PayTM. అలాంటి PayTM స్వతహాగా బ్యాంకు కూడా స్థాపించి తమ యూజర్లకు బ్యాంకింగ్ సేవలు కూడా అందించింది. అదే PayTM payments bank.

PayTM Crisis | పేటియం ఉపయోగిస్తున్నారా?.. అకౌంట్ ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు పాటించండి..
Business news telugu

PayTM Crisis(Business news telugu):


మీలో చాలామంది.. ఫోన్లలో PayTM ఉపయోగిస్తూ ఉంటారు. నోట్ల రద్దు తరువాత యుపిఐ చెల్లింపుల విధానం వచ్చింది. ఆ యుపిఐ చెల్లింపులను ప్రజలకు చేరువ చేసిన మొదటి PayTM. అలాంటి PayTM స్వతహాగా బ్యాంకు కూడా స్థాపించి తమ యూజర్లకు బ్యాంకింగ్ సేవలు కూడా అందించింది. అదే PayTM payments bank.

ఇప్పుడీ PayTMకు పెద్ద షాకించ్చింది.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ RBI (Reserve Bank of India). PayTM payments bankలో ఎలాంటి credit transactions చేయడానికి వీల్లేదని.. PayTM ఇకపై ఎటువంటి deposits స్వీకరించకూడదని RBI ఆంక్షలు విధించింది.


RBI ఆదేశాల ప్రకారం.. ఫిబ్రవరి 29,2024 తరువాత PayTM పూర్తిగా బ్యాంకింగ్ సేవలు నిలిపివేయడం జరుగుతుంది. Banking rules and regulationsని Paytm follow చేయడం లేదనే కారణాలు చూపుతూ RBI ఈ big decision తీసుకుంది.

ఇదంతా ఎందుకు జరిగింది. PayTM లాంటి అతిపెద్ద UPI సంస్థపై RBI ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఈ ప్రశ్నలకు సమాధనం ఏంటో ఒకసారి చూద్దాం.

PayTM payments bank account holders సంఖ్య మొత్తం 3 కోట్లకు పైగా ఉంది. PayTMలో 300 మిలియన్ వాలెట్స్ ఉన్నాయి. ఒక నెలలో 160 కోట్లకు పైగా transactions జరిగిన రికార్డ్ PayTM payments bankకు ఉంది. ఇప్పుడు RBI ఒక్క దెబ్బతో ఈ రికార్డులన్నింటికీ చెక్ పెట్టేసింది. బ్యాంకులు తప్పుచేస్తే.. కర్రతో కొట్టే RBI.. ఈసారి PayTM payments bank నెత్తిపై పిడుగు వేసింది.

మార్చి 11 2022న Reserve Bank.. Paytmకు ఒక నోటిస్ జారీ చేసింది. ఆ నోటిస్ ప్రకారం.. Paytm కొత్త customerలను add చేయకూడదు. వెంటనే ఒక authorised Income Tax teamతో company system and accountsని auditing అంటే విచారణ చేయించాలి.

ఈ audit పూర్తి అయ్యేవరకు existing customersతోనే business చేయాలి.

Paytm ఒక యూపిఐ payment gatewayతోపాటు ఒక banking platform కూడా. అందుకే Reserve Bank చెప్పిన అన్ని ఆదేశాలను Paytm కచ్చితంగా పాటించాల్సిందే. అందుకే 2022లో Paytm.. Reserve Bank ఆదేశాలను పాటించింది. Reserve Bank చెప్పినట్లు ఒక ఆడిట్ చేయించి .. దాని రిపోర్ట్ Reserve Bank వద్దకు వెళ్లింది.

అయితే ఈ రిపోర్టులో ఎన్నో అవతవకలు ఉన్నాయని.. Rules and Regulations follow చేయలేదని Reserve Bank అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని Paytmకు నోటిస్ ఇచ్చినా ఎటువంటి స్పందన రాకపోవడంతో జనవరి 31న Reserve Bank కఠిన నిర్ణయం తీసుకుంది.

భారతదేశంలో ఏదైనా కంపెనీ.. Banking operations అంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు చేపడితే.. ఆ కంపెనీ కచ్చితంగా RBI Rules పాటించాల్సిందే.

ఈ rules ఏంటి? Paytm ఎందుకు ఆ rulesని పాటించలేదో తెలుసుకుందాం.

Paytm మిగతా banksలాగా తన కస్టమర్ల నుంచి డబ్బులు deposit తీసుకుంటోంది. కానీ ఆ కస్టమర్ల వివరాలు పూర్తిగా వెల్లడించడం లేదు. అంటే KYC Rules పాటించడం లేదు.

ఉదాహరణకు Paytmpayments bankలో account ఉన్న కస్టమర్స్‌ పాన్ కార్డ్ వివరాలు లేవు. ఒక్కో పాన్ కార్డు మీద వందల కస్టమర్లున్నారు. ఎవరైనా కస్టమర్స్ Paytmpayments bankలో fixed deposit చేస్తే.. ఆ FDపై Paytmpayments bank కస్టమర్లకు వడ్డీ ఇవ్వలేదు.

వడ్డీ ఇస్తున్నట్లు Paytm చెబుతోంది.. కానీ రిపోర్ట్‌లో ఆ వివరాలు లేవు. కష్టమర్ల Annual Income Statementలో కూడా వడ్డీ వివరాలు కనబడడం లేదు.

కస్టమర్లు Income tax returns file చేసేటప్పుడు.. ఏదైనా బ్యాంక్ నుంచి వారికి depostisపై Interest లభిస్తే.. వాళ్లు Annual Income Statementలో చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే 1949 banking చట్టం ప్రకారం.. Reserve Bank of India.. Paytmకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 ,2024 తరువాత నుంచి Paytmpayments bankలో ఎటువంటి deposits చేయడానికి వీల్లేదు.

అలాగే Paytmpayments bankకు సంబంధించిన వాలెట్, Prepaid services, bank accounts, fast tag, లాంటి ఇతర సేవల కోసం డబ్బలు depostits చేయకూడదు.
ఇదంతా payments bankపై విధించిన ఆంక్షలు.

మరోవైపు cashback, Interest, లేదా ఏదైనా చెల్లింపులు కంపెనీ.. కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటే వాటిని ఫిబ్రవరి 29 తరువాత కూడా చెల్లించవచ్చు. దీనికి తోడు Paytmpayments bankతో లింక్ ఉన్న UPI నుంచి కూడా డబ్బులు మరో అకౌంట్‌కి పంపించడానికి కుదరదు. కానీ అకౌంట్‌లో డబ్బులు ఉంటే వాటిని కస్టమర్లు ఫిబ్రవరి 29 తరువాత కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 29 తరువాత Paytm OPERATIONS నడిపే కంపెనీలైన One97 communications Limited, Paytm Payments services Limitedకు సంబంధించిన Nodal accounts అన్నీ మూసివేస్తారు. అన్ని Nodal accountsకు సంబంధించిన settlement మార్చి 15 వరకు పూర్తవుతుంది.

ఇప్పుడు social mediaలో చాలామంది ఒక fake news spread చేస్తున్నారు. Paytm ఉపయోగిస్తే.. డబ్బులు పోతాయని. షాపుల్లో ఉన్న Paytm Speakerలు అంటే point of sale machines పనిచేయవని ప్రచారం జరుగుతోంది.

కానీ ఒక విషయం clearగా చెప్పాలి. కేవలం Paytm UPI ని use చేసేవాళ్లకి ఏ సమస్య ఉండదు. అంటే Paytm UPI ని వేరే బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసి ఉంటే ఏ సమస్య లేదు.
కానీ Paytm Payment bankలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు మాత్రం వెంటనే డబ్బు విత్ డ్రా చేసుకుంటే మంచిది.

అలాగే Paytm UPIని Paytm Payment bank accountతో లింక్ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వారు.. ఇక మీదట.. వేరే బ్యాంక్‌ అకౌంట్‌తో లింక్ చేసుకుంటే మంచిది. ఇంకా Paytm walletలో మీ డబ్బులు ఉంటే వాటిని కూడా విత్ డ్రా చేసుకోండి. ఇవి కస్టమర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో Paytm యజమాన్యం స్పందిస్తూ ఒక statement విడుదల చేసింది.

Reserve Bank ఆదేశాలు, మార్గదర్శకాలు మేము అమలు పరిచేందుకు మేము చాలా వేగంగా పనిచేస్తున్నాము. Paytm USERS భయపడాల్సిన అవసరం లేదు. యూజర్లు తమ SAVING ACCOUNTS, WALLET, FASTags, NCMC ACCOUNTSలో DEPOSIT చేసిన డబ్బులను యధావిథిగా ఉపయోగించవచ్చు.

అయితే Paytm చెప్పినట్లు అంతా ముందలాగా సాధారణ స్థితికి మారిపోతుందా. ఇందులో సమస్య ఏమీ లేదా?

దీనికి సమాధానం ఒకటే కనిపిస్తోంది. Paytm Payments bank మిగతా banks లాగే ఇదీ కూడా ఒక bank కాబట్టి.. దీన్ని పూర్తి మూసివేయాల్సి వస్తే.. మరో పెద్ద బ్యాంక్ దీన్ని టేకోవర్ చేస్తుంది.

ఉదాహరణకు గతంలో ఇలాగే YES BANK మూసివేయాల్సి వస్తే.. ప్రభుత్వం కలుగజేసుకుని.. STATE BANK OF India, Kotak Mahindra Bank, HDFC Bank మూడు బ్యాంకులు చేత YES BANKలో వాటా ఇచ్చి సమస్యను పరిష్కరించింది. YES BANK management ఇప్పుడు ఈ మూడు బ్యాంకులు నడుపుతున్నాయి.

ఇప్పుడు Paytm Payments bank పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తే.. మళ్లీ అలాంటి పరిష్కారం వైపే చూడాల్సి ఉంటుంది.

మరోవైపు RBI విధించిన ఆంక్షలతో Paytm Payments bank షేర్లను కొనగోలు చేసిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

RBI తీసుకున్న ఈ నిర్ణయం తరువాత SHARE MARKETలో Paytm Payments bank షేర్ విలువ భారీగా పతనమైంది. జనవరి 31న ఈ NEWS రావడంతో అప్పటివరకు Paytm Payments bank షేర్ విలువ 761.20 రూపాయలున్నాయి. కానీ తరువాతి రోజు SHARE MARKET open అవుతూనే షేర్ విలువ 609 రూపాయలకు పడిపోయింది. అంటే ఒకే రోజులో ఒక షేర్ పై ఏకంగా 152 రూపాయల నష్టం. ఈ వార్త రాసే సమయానికి Paytm Payments bank షేర్ విలువ రూ.458.65

దీనర్థం ఒక్కటే కంపెనీ షేర్లు కొన్నవారందరూ షేర్లు అమ్మకానికి పెట్టారు. అందుకే stock market నిపుణలు కూడా హెచ్చరిస్తున్నారు. ”ఇప్పుడు కొంతమంది ఇదే సమయం.. Paytm మళ్లీ పుంజుకుంటుంది. రిలయన్స్ కొనేస్తోంది.. అంబానీ ఆదుకుంటారు అని తప్పుడ సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. అది నమ్మి షేర్ విలువ మళ్లీ పెరుగుతుందని భావించి ఎవరు కూడా తొందరపడి పొరపాటున షేర్లు కొనవద్దు” అని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

Tags

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×