EPAPER

boAt Data Breach: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..!

boAt Data Breach: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..!
boAt Data Breach
boAt Data Breach

7.5 Million boAt Users Personal Information Leaked boAt Data Breach: ప్రముఖ స్మార్ట్ వాచ్, ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ యూజర్ల డేటా లీకైంది. దాదాపు 75 లక్షల మంది డేటా లీకైనట్లు సమాచారం. లీకైన డేటాలో వినియోగదారుల పేర్లు, అడ్రెస్‌లు, మొబైల్ నంబర్లు, కస్టమర్ ఐడీలు ఉన్నాయి. ఉల్లంఘనకు గురైన డేటాలో 2జీబీ డేటాను హ్యాకర్ డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉంచినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.


షాపిఫైగై అనే హ్యాకర్ బోట్‌కు చెందిన డేటాను ఏప్రిల్ 5వ తేదీన డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. దీని వలన యూజర్ల డేటా బయటకు లీక్ అవ్వడమే కాకుండా.. సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ డేటాను ఉపయోగించి యూజర్ల బ్యాంకు అకౌంట్స్ నిర్వహించడమే కాకుండా.. క్రెడిట్ కార్డులను వినియోగించి ఆర్ధిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ ఘటన కచ్చితంగా వినియోగదారులకు మేల్కొలుపులాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డార్క్ వెబ్‌లో ఉన్న సుమారు 7.5 మిలియన్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా దోపిడీకి గురవుతుందని పేర్కొన్నారు. “వ్యక్తులు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లయితే, అన్ని సంబంధిత అకౌంట్లలో తక్షణమే మార్చుకోవాలి. ఈ వేగవంతమైన చర్యలను తీసుకోవడం ద్వారా, వినియోగదారులు అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు, వారి సున్నితమైన సమాచారాన్ని దోపిడీ నుండి రక్షించుకోవచ్చు, ”అని సెకెల్ టెక్ CEO, వ్యవస్థాపకుడు రాకేష్ రఘువంశీ పేర్కొన్నారు.

Also Read: DATA BREACH: కొవిడ్ టెస్టింగ్.. మీ కొంప ముంచిందా..?

గతంలో భారతదేశంలోని ఇతర డేటా ఉల్లంఘనల జరిగనట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇది మిలియన్ల మంది భారతీయుల డేటా చోరీకి దారితీసింది. భారతీయుల ఆధార్ నంబర్‌లతో సహా – డార్క్ వెబ్ ఫోరమ్‌లలో అమ్ముడవుతోంది.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×