EPAPER

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ నుండి అదిరిపోయే ఫీచర్స్‌తో మరో కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చేసింది. చైనాలో ఈ మోడల్‌ను ఆవిష్కరించారు. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి వచ్చిన అతికొద్ది ఫోన్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్ ముందు మోడల్ కంటే ఫీచర్స్ విషయంలో చాలా అప్‌గ్రేడ్ చేయడం విశేషం. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో ఫోన్ అందుబాటులోకి రావడం వన్ ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం చైనాలో మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇండియాలో 2025 జనవరిలో ఈ ఫోన్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.


వన్ ప్లస్ 13 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

ప్రస్తుతం కర్వ్ డిస్ప్లేకు క్రేజ్ ఉండటంతో ఈ ఫోన్ కూడా కర్వ్ డిస్ప్లే ప్లేతోనే మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీంతో ఫోన్ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. 6.82 అంగుళాల డిస్ప్లే ఉండగా వీడియోలు చూసేవారికి చాలా బాగా ఉపయోగపడతుంది. డిస్ప్లే పైనే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూాడా ఇచ్చారు. ఈ ఫోన్‌లో గేమిండ్ కంట్రోలర్ ఫీడ్ బ్యాక్ ఫీచర్ ఉండటం విశేషం. దీంతో ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఐపీ69 అనే సరికొత్త ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. చైనీస్ మొబైల్స్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అధిక పీడనం నుండి ఫోన్ ను ర‌క్షిస్తుంది. ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే ట్రిపుల్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండ‌గా ప్ర‌ధాన కెమెరా సోని ఎల్‌వైటీ 808 సెన్సార్, ఓఐఎస్‌తో రూపొందించారు. ఇది మాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది. అదే విధంగా ఫ్రంట్ కెమెరాను 32 మెగాపిక్సల్స్‌తో అందుబాటులో ఉంచారు. చైనీస్ మార్కెట్ కోసం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓస్ 15‌తో రూపొందించారు. కానీ అంతర్జాతీయ వర్షన్ ఆక్సీజన్ ఓఎస్ 15‌తో రాబోతున్నట్టు సమాచారం. 6000 ఎంఏహెచ్ సిలికాన్ బ్యాటరీతో రూపొందించగా, 100డబ్యూ వైర్డ్, 50 డబ్లూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


వ‌న్ ప్ల‌స్ 13 ధ‌ర‌

ప్రస్తుతం చైనా మార్కెట్‌లో నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రారంభ వర్షన్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో తీసుకువచ్చారు. దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారంగా రూ.53,100 ఉంది. 12 GB+512 GB మోడల్ ధర రూ.57,900లుగా ఉంది. 16 GB+512 GB మోడల్ ధర రూ.62,600లుగా ఉంది. 24 GB+1TB మోడ‌ల్ ధ‌ర రూ.70,900లుగా ఉంది.

 

 

 

 

Related News

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Today Gold Rate: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

RPF Personal Praised: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ.. భలే కంట్రోల్ చేశారే, హైదరాబాద్ ఆర్పీఎఫ్‌లకు నెటిజన్స్ సెల్యూట్

Today Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెలవెలబోతున్న గోల్డ్ షాప్స్..!

Big Stories

×