EPAPER

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Indian Railway Rules: టిక్కెట్ లేకుండా రైళ్లలో చాలా మంది ప్రయాణిస్తుంటారు. పండుగ సీజన్ ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. కావాలని వెళ్లకున్నా, కొంత మంది టిక్కెట్ దొరక్క తప్పనిసరి పరిస్థితులలో రైలు ఎక్కుతుంటారు. టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారి విషయంలో రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించబోతోంది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ టీటీఈకి పట్టుబడితే జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇకపై రెండూ విధించాలని భావిస్తోంది. టిక్కెట్ లేని ప్రయాణం విషయంలో రైల్వేశాఖ తీసుకునే చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 ఏ సెక్షన్ కింద జరిమానా విధిస్తారు?

రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 137తో పాటు 138 కింద టిక్కెట్లు లేకుండా ప్రయాణిం వారికి జరిమానా విధించే అవకాశం ఉంది.


జరిమానా ఎంత విధించే అవకాశం ఉంది?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం,  టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తూ పట్టుబడితే.. రూ. 250 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. దీనికి తోడుగా టిక్కెట్ కు అయ్యే ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అధికంగా ఫైన్ విధించే సందర్భాలు ఏవి?   

ఒక ప్రయాణీకుడు టిక్కెట్ లేకుండా జర్నీ చేస్తూ పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సదరు ప్రయాణీకుడు ఎక్కడ రైలు ఎక్కాడు అనేది స్పష్టంగా తెలియని సందర్భంలో ఆ స్టేషన్ నుండి రైలు చివరి స్టేషన్‌ వరకు ఛార్జీని పెనాల్టీగా వసూళు చేస్తారు.

ప్లాట్‌ ఫారమ్ టిక్కెట్ ఉంటే ఫెనాల్టీ తగ్గుతుందా?   

టిక్కెట్ లేకుండా జర్నీ చేస్తూ పట్టుబడితే ఎక్కువ జరిమానా కట్టకుండా ఉండేందుకు ఫ్లాట్ ఫారమ్ టిక్కెట్ ఉపయోగపడుతుంది. ప్లాట్‌ ఫారమ్ టిక్కెట్ ద్వారా మీరు ఏ స్టేషన్ లో రైలు ఎక్కారో రుజువు చేసుకోవచ్చు. ఎక్కువ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.

జరిమానా చెల్లించిన తర్వాత సీటు పొందవచ్చా?

టిక్కెట్ లేని ప్రయాణీకుడు జరిమానా చెల్లిస్తే, అతడికి కచ్చితంగా సీటు లభిస్తుందని చెప్పలేం. టీటీఈ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైలులో సీటు ఖాళీగా ఉంటే, దానిని ప్రయాణీకుడికి ఇచ్చే అవకాశం ఉంది.

టికెట్ లేకుండా రైలే ఎక్కితే, ముందు ఈ పని చేయండి!  

కేవలం ఫ్లాట్ ఫారమ్ టిక్కెట్ తీసుకుంటే సరిపోదు. రైలు టిక్కెట్ కూడా తీసుకోవాలి.  అనివార్య కారణాలతో టిక్కెట్ తీసుకోకుండా రైలు ఎక్కితే, ఫస్ట్ టీటీఈని కలవాలి. ఏ కారణాల చేత టిక్కెట్ తీసుకోలేకపోయారో ఆయనకు వివరించాలి. ఇలా చేయడం ద్వారా నిర్ణీత జరిమా విధించి, బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది. అనవసర ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

జైలు శిక్ష ఎప్పుడు పడుతుందంటే?  

రైల్వే నిబంధనల ప్రకారం.. టిక్కెట్ లేకుండా పట్టుబడితే.. మీరు టీటీఈని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన కన్విన్స్ కాకపోతే రూ. 1000 జరిమానాతో పాటు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

Read Also: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

Hydrogen Train: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

×