EPAPER

Nissan x Trail: నిస్సాన్‌ ఎక్స్‌-ట్రైల్‌ డెలివరీలు షురూ.. వాటికి గట్టి పోటీ..!

Nissan x Trail: నిస్సాన్‌ ఎక్స్‌-ట్రైల్‌ డెలివరీలు షురూ.. వాటికి గట్టి పోటీ..!

Nissan X trail SUV Deliveries Started in India: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌కు దేశీయ ఆటో మొబైల్ మార్కెట‌్‌లో మంచి క్రేజ్ ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను తమ కార్లలో అందించి లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను తీసుకొచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవలే ఓ కొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేసింది. ‘నిస్సాన్ ఎక్స్‌ట్రైల్’ పేరుతో సరికొత్త కారును ఈ నెల అంటే ఆగస్టు ఆరంభంలో దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది.


ఈ ఫుల్ సైజ్ ఎస్యూవీ దేశీయ మార్కెట్‌లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌కి గట్టి పోటీ ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నిస్సాన్ ఎక్స్ ట్రైల్ కారు డెలివరీలు స్టార్ట్ అయ్యాయి. మొదటి యూనిట్‌ని బెంగళూరులో డెలివరీ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఎస్యూవీకి సంబంధించిన ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.

నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఎస్యూవీ దేశీయ మార్కెట్‌లో భారీ ధరతో ఎంట్రీ ఇచ్చింది. దాదాపు రూ.49.92 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలైంది. ఈ ఎస్యూవీ 7 సీటర్ సెగ్మెంట్‌లో వచ్చింది. దేశీయ మార్కెట్‌లోకి ఈ ఎస్యూవీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్‌లో వచ్చింది. ఇందులో 1.5 లీటర్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్, 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. కాగా ఈ ఇంజిన్ 160 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్‌లో వేరియబుల్ కంప్రెషన్ టెక్నాలజీ, టర్బో ఛార్జర్‌ వంటివి కలిగి ఉన్నాయి.


Also Read: థార్ రాక్స్ ఇండియాలో దిగింది.. ఇక దూకుడే దూకుడు.. ధర ఎంతంటే..?

కాగా ఈ ఎస్యూవీలో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ అనేవి ఉన్నాయి. ఈ ఫుల్ సైజ్ ఎస్యూవీ ఫ్యామిలీ కారుగా ఇండియన్ రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. ఇది దాని లుక్స్, డిజైన్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ కారు ఫ్రంట్ సైడ్ డిజైన్ వి మోషన్ గ్రిల్, హెడ్‌లైట్స్ పై భాగంలో డిఆర్ఎల్స్ వంటివి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీని డార్క్ థీమ్ ఇంటీరియర్స్‌ను సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో నిర్మించారు.

అలాగే 12.3 ఇంచుల డిజిటల్ ఇన్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్లోటింగ్ 8.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో హోల్డింగ్స్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మరిన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్్ సిస్టమ్స్‌ను అందించారు. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. 360 డిగ్రీల వ్యూ కెమెరా అందించబడింది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×