EPAPER

Upcoming Maruti And Honda Cars: మారుతి, హూండా నుంచి కొత్త కార్లు.. ఫీచర్లు, లాంచ్ వివరాలివే..?

Upcoming Maruti And Honda Cars: మారుతి, హూండా నుంచి కొత్త కార్లు.. ఫీచర్లు, లాంచ్ వివరాలివే..?

2024 Maruti Dzire and 2024 Honda Amaze: దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎస్యూవీలకు ఉన్న డిమాండ్ మరే మోడళ్లకు లేవనే చెప్పాలి. ప్రస్తుతం ఎస్యూవీలు భారతదేశ మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త ఎస్యూవీలను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. వాహన దారుల టేస్ట్‌కి తగ్గట్టుగా ఫీచర్లలో మార్పులు చేస్తూ ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా స్పెసిఫికేషన్లను అందిస్తున్నాయి. అయితే త్వరలో మరో రెండు సెడాన్‌లు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.


ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు అయిన మారుతి సుజుకి, హోండా కార్స్ ఇండియా కంపెనీలు త్వరలో తదుపరి తరాలకు చెందిన డిజైర్, అమేజ్‌లను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. సరికొత్త మారుతి డిజైర్ ఈ పండుగ సీజన్‌లో ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది. అయితే అప్‌డేట్ చేయబడిన హోండా అమేజ్ డిసెంబర్ 2024 ప్రారంభం కానుంది. దీని సేల్స్ 2025 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు వాహనాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

కొత్త మారుతి డిజైర్


మారుతి డిజైర్ ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సేల్‌లో కూడా అదరగొడుతుంది. ఇప్పుడు సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ను అనుసరించి.. 2024 మారుతి డిజైర్ త్వరలో రానుంది. అన్ని కొత్త Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో ముఖ్యమైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, మెరుగైన స్టైలింగ్, అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది.

Also Read: మహీంద్రా కార్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడు ఎంతకు కొనేయొచ్చంటే..?

అలాగే 2024 మారుతి డిజైర్ ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ బంపర్‌తో సరికొత్త లుక్‌ని అందిస్తుంది. అంతేకాకుండా టైల్యాంప్ క్లస్టర్‌లు కూడా అప్‌డేట్ చేయబడతాయి. ఇందులో స్విఫ్ట్ మాదిరిగానే 9-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సవరించిన డ్యాష్‌బోర్డ్, కొత్త HVAC కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందుతుంది. అదే సమయంలో లైట్ కలర్ ఇంటీరియర్ థీమ్‌ను పొందే అవకాశం ఉంది.

కొత్త హోండా అమేజ్

ఇక కొత్త హోండా అమేజ్ విషయానికొస్తే.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఉన్న హూండా అమేజ్ భారీ ప్రజాదరణ అందుకుంది. అనేక కారణాల చేత హోండా అమేజ్ ఎల్లప్పుడూ కస్టమర్‌లచే ప్రశంసించబడుతోంది. ఇప్పుడు ఇది అప్‌డేట్‌ వెర్షన్‌లో రాబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజా నివేదికల ప్రకారం.. కొత్త హోండా అమేజ్ బ్రాండ్ గ్లోబల్ సెడాన్‌ల నుండి కొన్ని డిజైన్‌లను కలిగి ఉంది. తక్కువ వీల్‌బేస్‌తో ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ అప్‌డేట్ చేయబడిన వెర్షన్‌లో డెవలప్ చేయబడుతుందని భావిస్తున్నారు.

ఇది ఎలివేట్‌లో ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలివేట్ నుండి కొన్ని ఇతర ఫీచర్లను కూడా పొందవచ్చు. పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 90bhp, 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 1.2L, నాలుగు-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగే అవకాశం ఉంది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×