EPAPER

Fuel Saving Tyres for Cars: అధిక మైలేజ్ ఇచ్చే టైర్లు.. ఇంధన సమస్యకు చెక్.. డబ్బును ఆదా అవుతుంది

Fuel Saving Tyres for Cars: అధిక మైలేజ్ ఇచ్చే టైర్లు.. ఇంధన సమస్యకు చెక్.. డబ్బును ఆదా అవుతుంది

Fuel Saving Tyres for Cars: టైర్ కంపెనీ మిచెలిన్ తన అత్యంత ఇంధన సామర్థ్యం గల ట్రక్, బస్ టైర్, Michelin X మల్టీ ఎనర్జీ Z+ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ మేడ్ ఇన్ ఇండియా టైర్లు వివిధ భారతీయ రహదారి, లోడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టైర్ల తయారీలో ఇంధన ఆదా టైర్ల కోసం భారతీయ వాహనదారులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇవి 15 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తాయి. ఫ్లీట్ ఆపరేటర్లు రూ. 3 లక్షల వరకు ఆదా చేసుకోగలుగుతారు.


Michelin X మల్టీ ఎనర్జీ Z+ టైర్ టెక్నాలజీలో ఉహించనంత డెవలప్మెంట్ చూస్తారు. ఇవి పరిశ్రమలో లో రోలింగ్ రెసిస్టెంట్ కలిగి ఉన్నాయి. ఇది 15 శాతం వరకు ఇంధన ఆదాను అందిస్తుంది. ఈ ట్యూబ్‌లెస్ ట్రక్ టైర్ పరిమాణం 295/80R22.5. ఇది అత్యతం ఫేమస్ అయిన మిచెలిన్ X మల్టీ ఎనర్జీ Z అప్‌గ్రేడ్ వెర్షన్. ఇవి CO2 కాలుష్యాన్ని 8 టన్నుల వరకు తగ్గించడంలో సహాయపడేలా రూపొందించబడ్డాయి. ఈ టైర్లు ట్రెడిషినల్ ట్యూబ్ టైర్ల కంటే 20 శాతం ఎక్కువ కాలం లైఫ్ ఇస్తాయి.

మిచెలిన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శంతను దేశ్‌పాండే మాట్లాడుతూ.. మిచెలిన్ మల్టీ ఎనర్జీ Z+ టైర్‌లను విజయవంతంగా ప్రారంభించడం వల్ల ట్రక్కుల నిర్వహణ ఖర్చులలో 60 శాతం దోహదపడే ప్రధాన సమస్య అయిన అధిక ఇంధన ధరలను తగ్గించవచ్చని అన్నారు. మిచెలిన్ కోసం,పర్యావరణ అనుకూలమైన లైప్ అండ్ టెక్నాలజీతో పురోగతులు అడ్వాన్స్‌గా కలిసి ఉంటాయి.


Also Read: మీ ప్రయాణాలకు ఇదే సేఫ్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్ EV!

పర్యావరణాన్ని గౌరవించడం అనేది మా దీర్ఘకాలిక నిబద్ధత, ఇది మిచెలిన్  ఐదు ప్రధాన విలువలలో ఒకటి. 30 సంవత్సరాలకు పైగా గ్రూప్ తన పర్యావరణ కాడాడి, ఉద్ఘారాలను తగ్గించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వినూత్న ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలను తక్కువ ప్రభావంతో నిరంతరం డిజైన్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. టైర్లలో మిచెలిన్ 1992 నుండి ‘గ్రీన్’ టైర్లను విడుదల చేయడంతో ఒక ముద్రను వేసుకొంది.

Tags

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×