EPAPER

MG Bingo Hatchback Patented In India: 333కిమీ రేంజ్‌తో MG నుంచి బుజ్జి EV.. మార్కెట్ షేక్ కావడం పక్కా!

MG Bingo Hatchback Patented In India: 333కిమీ రేంజ్‌తో MG నుంచి బుజ్జి EV.. మార్కెట్ షేక్ కావడం పక్కా!

MG Bingo Hatchback Patented In India: MG మోటార్ తన కొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ కోసం పేటెంట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. దీని డిజైన్ చాలా వరకు ఫస్ట్ జనరేషన్ మారుతి స్విఫ్ట్‌ని పోలి ఉంటుంది. కంపెనీ దీనికి బింగో EV అని పేరు పెట్టింది. ఇది టాటా టియాగో EVతో పోటీ పడుతుందని వెల్లడించారు. MG మోటార్స్ ఇండియా- JSW కంపెనీతో కలిసి దీన్ని తయారు చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ప్రతి 4 నుండి 6 నెలలకు ఒక కొత్త కారును విడుదల చేస్తుంది.


కంపెనీ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో బింగో హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. ఇందులో చైనా, ఇండోనేషియా వంటి మార్కెట్లు ఉన్నాయి. కామెట్ పక్కన, బింగో కర్వ్‌డ్ సర్ఫేజెస్, ప్రీమియం టచ్‌లతో కూడిన 5-డోర్ల హ్యాచ్‌బ్యాక్. దాని లోపలి భాగంలో కామెట్ EV నుండి అనేక ఫీచర్లను తీసుకొనున్నారు. వీటిలో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టీరింగ్ వీల్, ఇతర కంట్రోల్ బటన్‌ల కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉన్నాయి.

Also Read: రికార్డులు బ్లాస్ట్.. ఫస్ట్‌ప్లేస్‌లోకి కొత్త స్విఫ్ట్.. లెక్కలు ఇవే!


ఇది ఇంటీరియర్‌లో క్రోమ్ టచ్‌లు, సాఫ్ట్ బిట్‌లను కలిగి ఉంది ఇది కారు ప్రీమియంగా చేస్తుంది. ఇది కామెట్ EV, రాబోయే క్లౌడ్ EV మాదిరిగానే అదే GSEV (గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్) ఫస్ట్-EV ప్లాట్‌ఫారమ్‌‌ను కలిగి ఉంటుంది. బింగో దాని 3,950 మిమీ పొడవుతో టియాగో కంటే కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ ఫ్లోర్‌తో సహా పెద్ద క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.

Also Read: ఆధార్ అప్‌డేట్.. జూన్ 14న లాస్ట్.. భారీ మూల్యం తప్పదా?

ఎంట్రీ-లెవల్ బింగోలో 17.3kWh బ్యాటరీ, 41hp మోటార్ ఉంది. చైనా CLTC సైకిల్స్‌లో ఈ వేరియంట్ రేంజ్ దాదాపు 203 కి.మీ. టాప్-స్పెక్ బింగోలో పెద్ద 31.9kWh బ్యాటరీ,  333km (CLTC) రేంజ్‌కి మంచి 68hp మోటార్ ఉంది. దీని లో స్పెక్ టియాగో EV 19.2kWh బ్యాటరీ, 61hp మోటారుతో MIDC రేంజ్ 250కిమీ. లాంగ్ రేంజ్ వెర్షన్ 315km (MIDC) రేంజ్‌తో 24kWh బ్యారటీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 75hp పవర్‌ను మోటార్‌కు ఇస్తుంది.

Tags

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×