EPAPER

MG Hector Price Hiked: MG మోటార్ ప్రియులకు షాక్.. సైలెంట్‌గా పెరిగిపోయిన హెక్టర్, హెక్టర్+ ధరలు.. ఎంతంటే?

MG Hector Price Hiked: MG మోటార్ ప్రియులకు షాక్.. సైలెంట్‌గా పెరిగిపోయిన హెక్టర్, హెక్టర్+ ధరలు.. ఎంతంటే?

MG Hector and Hector+ Price Hiked: భారతీయ మార్కెట్‌లో ఎంజీ మోటార్ కంపెనీ కార్లకు సూపర్ క్రేజ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లతో కొత్త కొత్త కార్లను రిలీజ్ చేసి కంపెనీ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎంజీ మోటార్‌ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో హెక్టర్, హెక్టర్ ప్లస్ కార్లు ముందువరుసలో ఉన్నాయి. దీంతో ఈ కార్లకు డిమాండ్ పెరగడంతో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో బాగంగానే వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. హెక్టర్, హెక్టర్ ప్లస్ ధరలను కంపెనీ వరుసగా రూ. 22,000 – రూ.30,000 పెంచింది. అయితే వేరియంట్, పవర్‌ట్రెయిన్‌ను బట్టి ఈ పెరుగుదల మారుతుంది.


MG హెక్టార్

MG హెక్టార్ ఎంట్రీ-లెవల్ స్టైల్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఇతర వేరియంట్‌ల విషయానికొస్తే.. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ మోడల్ ధర రూ.16,000 నుంచి రూ. 20,000, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన పెట్రోల్ మోడల్ ధర రూ.17,000 నుంచి రూ.22,000, డీజిల్ మోడల్ ధర రూ.18,000 నుంచి రూ.22,000 వరకు పెరిగింది. వీటి ధరల విషయానికొస్తే.. MG హెక్టర్ ధర ఇప్పుడు రూ.13.99 లక్షల నుండి పెట్రోల్ ట్రిమ్‌లపై రూ.18.43 లక్షలకు చేరుకుంది. హెక్టర్ డీజిల్ ధర రూ.17.30 లక్షల నుండి రూ.22.24 లక్షల వరకు ఉంది. అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు.


MG హెక్టర్ ప్లస్

3-వరుస హెక్టార్ ప్లస్ పెట్రోల్ MT వెర్షన్ ధర రూ.20,000 నుంచి రూ.23,000, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.24,000 నుంచి రూ. 25,000, డీజిల్ వేరియంట్ ధర రూ.20,000 నుంచి రూ.30,000 వరకు పెరిగింది. ఇక దీని ధర విషయానికొస్తే.. MG Hector Plus రేంజ్ ఇప్పుడు రూ.17.30 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదే పెట్రోల్ వేరియంట్ ధర రూ.22.93 లక్షల వరకు ఉంది. డీజిల్ వేరియంట్ రూ.19.82 లక్షల నుండి రూ.23.08 లక్షలకు చేరుకుంది. అయితే ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Also Read: Budget E-Scooter: మహిళలకు, వృద్ధులకు ఇదే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. ధర చాలా చీప్..!

ఇక ఈ రెండు మోడల్స్ పవర్ట్రైన్ విషయానికొస్తే.. హెక్టర్ లేదా హెక్టర్ ప్లస్‌లో ఎలాంటి మెకానికల్ ఛేంజెస్ చేయలేదు. ఈ రెండూ 143hp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మరొక ఎంపిక FCA- సోర్స్డ్ 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 170hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో ట్రాన్స్‌మిషన్ ఎంపికలు 6-స్పీడ్ MT, CVT ఉన్నాయి. డీజిల్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంది.

Tags

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×