BigTV English

Layoffs in Media :- టెక్ కంపెనీల బాటలో.. దిగ్గజ మీడియా సంస్థలు..

Layoffs in Media :- టెక్ కంపెనీల బాటలో.. దిగ్గజ మీడియా సంస్థలు..

Media houses following tech companies : ఆర్థిక మాంద్యం భయాలతో… గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలన్నీ… వేల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా… అమెరికాలో వివిధ మీడియా సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. CNN నుండి వాషింగ్టన్ పోస్ట్ దాకా… ప్రతీ మీడియా సంస్థ కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. ఇప్పటిదాకా CNN, NBC, MSNBC, BUZZFEED, వాషింగ్టన్ పోస్ట్… ఉద్యోగుల తొలగింపుపై ప్రకటనలు చేయగా… ఇప్పుడు వోక్స్ మీడియా కూడా 7 శాతం సిబ్బందిని తీసివేస్తున్నట్లు ప్రకటించింది.


వోక్స్ మీడియా ఆధ్వర్యంలో వోక్స్, ది వెర్జ్ వైబ్ సైట్లతో పాటు ల్యాండ్ మార్క్ న్యూయార్క్ మ్యాగజైన్, దాని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పనిచేస్తున్నాయి. అన్నింటిలో కలిపి 1900 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వారిలో 7 శాతం మందిని, అంటే 130 మందిని తీసేస్తున్నట్లు వోక్స్ మీడియా ప్రకటించింది. సవాళ్లతో కూడిన ఆర్థిక వాతావరణం కారణంగా… వివిధ విభాగాలలో పనిచేస్తున్న 7 శాతం మందిని తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నామని… వోక్స్ మీడియా సీఈఓ జిమ్ బాంకోఫ్ సిబ్బందికి ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. అంతేకాదు… 130 మందిని తక్షణం ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించారు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ 2021 అధ్యయనం ప్రకారం, అమెరికా మీడియా రంగంలో ఉపాధి స్థిరమైన క్షీణతను చూసింది. 2008 నుంచి 2020 మధ్య… అమెరికా మీడియా రంగంలోని సిబ్బంది సంఖ్య… 1,14,000 నుంచి 85,000 మందికి పడిపోయింది. జర్నలిజం చాలా కాలంగా ఒత్తిడిలో ఉందని, అనేక కంపెనీలు ఉద్యోగులపై ఖర్చు చేసే మొత్తాన్ని గణనీయంగా తగ్గించడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాయని… ఇది జర్నలిస్టులతో పాటు జర్నలిజాన్ని కూడా దెబ్బ తీస్తుందని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వ్యాఖ్యానించింది. ఇకపై కూడా మీడియా సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపింది.


Follow this link for more updates:- Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×