EPAPER

Hatchback Cars in April 2024: టాప్-10 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే.. అమ్మకాల్లో రికార్డులే రికార్డులు..!

Hatchback Cars in April 2024: టాప్-10 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే.. అమ్మకాల్లో రికార్డులే రికార్డులు..!

Hatchback Cars in April 2024: భారతీయ మార్కెట్‌లో SUV సెగ్మెంట్‌తో పాటు కార్లు అనేక ఇతర విభాగాలలో అమ్ముడవుతున్నాయి. ఇందులో సెడాన్ నుండి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ వరకు కార్లు ఉన్నాయి. ప్రతి నెలా పెద్ద సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. SUV, సెడాన్ సెగ్మెంట్ వాహనాలతో పాటు, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లను కూడా చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2024లో టాప్-10 హ్యాచ్‌బ్యాక్ కార్ల వివరాల గురించి తెలుసుకుందాం.


Maruti Suzuki Wagon R
వాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ కారును దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చాలా కాలంగా భారత మార్కెట్లో అందిస్తోంది. ఏప్రిల్ 2024లో కూడా ఇతర హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చితే ఈ కారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే దీని అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణతను నమోదు చేశాయి. గత నెలలో మారుతి వ్యాగన్ ఆర్ మొత్తం 17850 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 20879 యూనిట్లను విక్రయించింది.

Maruti Baleno
మారుతి బాలెనో ఏప్రిల్ 2024లో అత్యధికంగా ఇష్టపడిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో రెండవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2024లో కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ కారు 14049 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ 2023లో ఈ కారు మొత్తం 16180 యూనిట్లు అమ్ముడయ్యాయి. డేటా ప్రకారం బాలెనో అమ్మకాలు 13 శాతం క్షీణించాయి.


Also Read: పల్సర్ NS400Z ఫస్ట్ రివ్యూ.. రైడింగ్ ఎలా ఉంది? కొనేముందు ఇవి తెలుసుకోండి!

Maruti alto
మారుతి ఆల్టో అమ్మకాలు ఈ ఏడాది క్షీణించాయి. కానీ ఇప్పటికీ భారతదేశంలో ఇది చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత నెలలో ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మొత్తం 9043 యూనిట్లు విక్రయించబడ్డాయి. గతేడాది ఈ కారును 11548 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు.

Tata Tiago
హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల జాబితాలో టాటా టియాగో తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారును ఏప్రిల్ 2024లో 6796 మంది కస్టమర్‌లు కొనుగోలు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో మొత్తం అమ్మకాలు 8450 యూనిట్లుగా ఉన్నాయి.

Also Read: కొత్త స్విఫ్ట్ వర్సెస్ బాలెనో.. రెండిటిలో ఏది బెటర్? ఏది కొనాలి?

Hyundai i20
i20ని హ్యుందాయ్ ఈ విభాగంలో అందిస్తోంది. హ్యుందాయ్ ఐ-20 అమ్మకాల పరంగా ఐదవ స్థానంలో నిలిచింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మొత్తం 5199 యూనిట్లు ఏప్రిల్ 2024లో విక్రయించబడ్డాయి. ఏప్రిల్ 2023లో మొత్తం 6472 యూనిట్లు విక్రయించబడ్డాయి. అమ్మకాల పరంగా ఈ కారు గత నెలలో 20 శాతం తక్కువగా విక్రయించారు.

Tata Altroz 

టాటా ఆల్ట్రోజ్ గత నెలలో 5148 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ-10 5177, టయోటా గ్లాంజా 4380, మారుతీ స్విఫ్ట్ 4094, మారుతి సెలెరియో 3220 యూనిట్లను ఏప్రిల్ 2024లో విక్రయించింది.

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×