EPAPER

Maruti Suzuki Dream Series: డ్రీమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చిన మారుతి సుజుకి.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Maruti Suzuki Dream Series: డ్రీమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చిన మారుతి సుజుకి.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Maruti Suzuki Dream Series Limited Edition: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. ఆల్టో K10 VXI+, S-Presso VXI+, Celerio LXI వంటి మూడు ప్రసిద్ధ మోడళ్ల కోసం ప్రత్యేకమైన ‘డ్రీమ్ సిరీస్ లిమిటెడ్ ఎడిషన్’ని పరిచయం చేసింది. ఈ డ్రీమ్ సిరీస్ లిమిటెడ్ ఎడిషన్‌తో ఇవి చాలా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. మారుతి నుంచి వచ్చిన ఈ ఎడిషన్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ‘డ్రీమ్ సిరీస్ లిమిటెడ్ ఎడిషన్’ మోడల్‌లు జూన్ 2024 నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.


మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్నాయి. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన కార్లను బడ్జెట్ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ డ్రీమ్ ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు ఉన్నాయి. కాస్మెటిక్ మార్పులు చేయబడ్డాయి. దీంతో ఇది స్టాండర్డ్ మోడల్ కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే దీనికి ప్రత్యేక బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.

ఇందులో ప్రతి మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో‌కి మద్దతునిస్తుంది. వీటితో పాటు మారుతి సుజుకి తమ కస్టమర్లకు ఆకర్షణీయమైన ధరలలో మెరుగైన ఫీచర్లను అందిస్తుంది. ఇటీవల Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, Dzire, Baleno, FRONX, ఇగ్నిస్ వంటి ఎంపిక చేసిన మోడళ్ల AGS వేరియంట్‌లకు కంపెనీ ధర తగ్గింపును ప్రకటించింది.


Also Read: మైలేజీలో తోపు కారు ఏదైనా ఉంది అంటే అది ఇదే.. సేఫ్టి ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయ్!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘మారుతి సుజుకిలో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్ స్థిరమైన వృద్ధిలో సరసమైన ఎంట్రీ-లెవల్ కార్లు పోషించే కీలక పాత్రను మేము అర్థం చేసుకున్నాము. అందువల్లనే మా ‘డ్రీమ్ సిరీస్ లిమిటెడ్ ఎడిషన్’ మోడళ్లను బడ్జెట్ ధరలో తీసుకొచ్చాం. దీని ద్వారా ఈ విభాగంలో మరింత వృద్ధి సాధిస్తామని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.

మారుతీ ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షలుగా ఉంది. అలాగే ఎస్-ప్రెస్సో రూ.4.27 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. సెలెరియో రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే.

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×