EPAPER

IRCTC: రైల్వే ఫుడ్ లో జెర్రి.. అధికారుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం

IRCTC: రైల్వే ఫుడ్ లో జెర్రి.. అధికారుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం

Indian Railways Food: భారతీయ రైల్వే వ్యవస్థకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్నా, క్షేత్రస్థాయి సిబ్బంది చేసే పొరపాట్ల కారణంగా తరచుగా తీవ్ర విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గా రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే దుప్పట్లు, బెడ్ షీట్లు నెలకు ఓసారి ఉతుకుతామని చెప్పి షాకివ్వగా, తాజాగా ఫుడ్ ఏకంగా జెర్రి రావడంతో ప్రయాణీకులు షాక్ అయ్యారు. రైల్వే అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రైల్వే ఫుడ్ లో జెర్రి

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో అందించే ఫుడ్ కు సంబంధించిన పరిశుభ్రత మీద ప్రయాణీకులలో ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఫుడ్ విషయంలో సరైన ప్రమాణాలు పాటించరనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఫుడ్ లో జెర్రి రావడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది.  అదీ IRCTC VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ లో ఆర్డర్ చేసిన ‘రైతా’లో వచ్చినట్లు ఓ వ్యక్తి వెల్లడించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైల్వే ఫుడ్ లో జెర్రి వచ్చినట్లు వెల్లడించాడు. ఈ పిక్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇలాంటి ఫుడ్ పెట్టి ప్రయాణీకులను చంపాలని చూస్తున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇండియన్ రైల్వే పోస్టుకు కౌంటర్

గత కొద్ది రోజుల క్రితం ఇండియన్ రైల్వేస్ ట్విట్టర్ వేదికగా ఫుడ్ గురించి ఓ ఫోటో షేర్ చేసింది. భారతీయ రైల్వేలలో ప్రయాణీకులకు అందించే ఫుడ్ నాణ్యత పెరిగిందని వెల్లడించింది. “గత కొద్ది సంవత్సరాలతో పోల్చితే, భారతీయ రైల్వే ఆహార నాణ్యత కాస్త మెరుగుపడింది” అంటూ ప్రయాణీకుల కోసం ఫుడ్ తయారు చేసే కిచెన్ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్టుకు ‘aaraynsh’ అనే వ్యక్తి కౌంటర్ గా  ఫుడ్ లో జెర్రి ఉన్న ఫోటోను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. “అవును,  కచ్చితంగా భారతీయ రైల్వే ఆహార నాణ్యత మెరుగుపడింది. ఇప్పుడు రైతాను మరింత ప్రొటీన్ తో అందిస్తున్నారు” అంటూ కామెంట్ పెట్టాడు. “ఈ ఫుడ్ అందించింది  IRCTC VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ లో.సాధారణ రైళ్లు, ప్యాంట్రీ కార్లలో ఫుడ్ క్వాలిటీ ఏ లెవల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

రైతాలో జెర్రి ఉన్న ఫోటోను చూసి నెటిజన్లు భారతీయ రైల్వే సంస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “అందుకే టిక్కెట్లు బుకింగ్ చేసేటప్పుడు నేను రైలు ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోను” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వీలైనంత వరకు ఫుడ్ ను తీసుకోకపోవడం మంచిది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “డబ్బులు తీసుకుని ఇలాంటి చెత్త ఫుడ్ సరఫరా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Related News

Gold Rates: ఫ్యూచర్‌లో బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..?

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Big Stories

×