EPAPER

Financial Planning: గోప్యత వద్దు.. రేపటి భద్రతే ముద్దు..

Financial Planning: గోప్యత వద్దు.. రేపటి భద్రతే ముద్దు..

 


Financial Planning

Financial Planning with Life Insurance: ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఆర్ధిక విధానాలు, పెట్టుబడులు, విధుల నిర్వహణ కోసం పునాదిని ఏర్పాటు చేసే ప్రక్రియ. లైఫ్ ఇన్సూరెన్స్ , హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి.పెట్టుబడి అంటేనే దీర్ఘకాలిక ప్రణాలిక. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలలో ఏదో ఒక రకమైన అవకతవకలు ఉంటాయనన్నది నిజం. మన సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, పెట్టుబడిగా పెట్టడం ద్వారా మన భవిష్యత్తు సురక్షితంగా ఉండటమే కాకుండా, మన కుటుంబ భవిష్యత్తుకు కూడా అది సహాయపడుతుంది.
ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా ఒక అత్యవసరం.


ఊహించని పరిస్థితిలో ఆ బీమా పాలసీయే ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. అయితే.. ఆ పాలసీ కొనుగోలు వేళ.. జరిగే కొన్ని చిన్నచిన్న పొరపాట్ల వల్ల క్లెయిం సమయంలో పాలసీ తిరస్కరణకు గురవుతుంది. దీనివల్ల ఆ కుటుంబానికి ఏ సాయమూ అందదు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాలసీదారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కీలక అంశాలు

టర్మ్ ఇన్సూరెన్స్ :  బీమా పాలసీల్లో తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణనిచ్చేది.. టర్మ్‌ పాలసీ. దీన్ని  తీసుకునేటప్పడు అనారోగ్య సమస్యలు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను నిజాయితీగా వెల్లడించాలి. ఇలాంటివి దాచిపెట్టి పాలసీ తీసుకున్నా.. తీరా క్లెయిం సమయానికి బీమా సంస్థలు ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తాయి. బీమా సంస్థ దరఖాస్తులో అడిగిన సమాచారం అంతా ఇవ్వాలి.

Read more: సరికొత్త ఫీచర్లతో 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ మోడల్స్ వచ్చేసాయ్!

ముఖ్యంగా ఆదాయ వివరాల వంటివాటిని దాచొద్దు. బీమా ప్రీమియాన్ని సకాలంలో చెల్లించాలి. కొన్నిసార్లు బీమా ప్రీమియం చెల్లింపులో ఆలస్యం వల్ల కూడా క్లెయిం తిరస్కరణకు గురవుతుంది. కనుక మీ అవసరాలు పక్కనబెట్టి అయినా.. ఆ పాలసీ అమల్లో ఉండేలా చూడాలి. క్లెయిం చెల్లింపులో ముందున్న బీమా సంస్థలోనే పాలసీ తీసుకోవాలి. ఐఆర్‌డీఏఐ లేదా ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన సమాచారం చూడొచ్చు.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్: ఇది జీవిత భీమా.. 5సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత క్రమం తప్పుకుండా డబ్బులను విత్ డ్రా చేసుకోచ్చు.

క్లెయిం తిరస్కరణకు గురైతే..
వినియోగదారుల సేవా కేంద్రంలో తిరస్కరణకు కారణాలు తెలుసుకోండి. ఏజెంటుతో సహా పాలసీ తీసుకున్న శాఖకు వెళ్లి, అధికారులను కలిసి మాట్లాడాలి. అప్పటికీ సానుకూల సమాధానం రాకపోతే.. అంబుడ్స్‌మన్‌ను కలిసి ఫిర్యాదును నమోదు చేయండి.

Related News

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Big Stories

×