Big Stories

ChatGPT:యూట్యూబ్ మాదిరే.. చాట్‌జీపీటీలోనూ కాసుల గలగలలు..

ChatGPT:టెక్నాలజీ రంగంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ ద్వారా… గూగుల్‌ను మించిన సేవల్ని పొందొచ్చు. అంతేకాదు… యూట్యూబ్ మాదిరే, చాట్‌జీపీటీ ద్వారా కూడా డబ్బు సంపాదించొచ్చు. అది ఎలాగో… చాట్‌జీపీటీనే స్వయంగా చెబుతోంది. ఈ అంశంపై యూజర్లు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలిస్తోంది. యూజర్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో… వైరల్ అవుతున్నాయి. చాట్‌జీపీటీ సాయంతో 2023లో డబ్బు సంపాదించడం ఎలా? అని యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా… 7 మార్గాల్లో డబ్బులు సంపాదించొచ్చని చాట్‌జీపీటీ తెలిపింది. అవి ఏంటంటే..

- Advertisement -

చాట్‌జీపీటీ సాయంతో చాట్‌బాట్‌ తయారు చేసి, వాటికి లైసెన్స్‌ పొంది… దాన్ని వ్యాపార సంస్థలకు లేదా వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ సాయంతో కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెన్స్ లేదా ఇతర పనులు చేసుకోవచ్చు. చాట్‌జీపీటీని సొంత ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేట్‌ చేసి… కన్సల్టింగ్‌, డెవలప్‌మెంట్‌ సర్వీసుల్ని అందించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్‌ సాయంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లు, లేదా ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డేటా తయారు చేసి… కోర్సుల పేరుతో ఆ డేటాను అమ్ముకోవచ్చు. చాట్‌జీపీటీ అందించే యూనిక్‌ అండ్‌ ఎంగేజింగ్‌ కంటెంట్‌ సాయంతో సోషల్‌ మీడియా, బ్లాగ్స్‌, వెబ్‌సైట్స్‌ నడిపి…
ప్రమోషనల్‌ యాడ్స్‌ను డిస్‌ప్లే చేసి ఆదాయాన్ని పొందవచ్చు.

- Advertisement -

స్టాక్‌ మార్కెట్‌ మీద పట్టు ఉన్న వాళ్లైతే… చాట్‌జీపీటీ ద్వారా ఆటోమెటెడ్‌ ట్రేడింగ్‌ స్ట్రాటజీని బిల్డ్‌ చేసి… ట్రేడింగ్‌ లేదా కన్సల్టింగ్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీలను అప్లై చేసి… డబ్బు సంపాదించవచ్చు. చాట్‌జీపీటీ బేస్డ్‌ చాట్‌బోట్‌ను తయారు చేసి… కస్టమర్‌ సర్వీస్‌, వర్చువల్‌ అసిస్టెంట్ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌తో ఆదాయం పొందవచ్చు. అలాగే లాంగ్వేజెస్‌ సంబంధిత వ్యాపారాల్లో కొన్ని పనులు చేసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌, టెక్ట్స్‌ సమరైజేషన్‌ వంటి పనులు చేస్తూ మనీ కళ్లజూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News