EPAPER

Kia EV6 Recalled: వాహనదారులకు బిగ్ షాక్.. ఆ కియా కార్లు వెనక్కి ఇవ్వాలి.. టైమ్ ఇదే..!

Kia EV6 Recalled: వాహనదారులకు బిగ్ షాక్.. ఆ కియా కార్లు వెనక్కి ఇవ్వాలి.. టైమ్ ఇదే..!

Kia Recalled EV6 Model: దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా భారత మార్కెట్లో అత్యంత ఇష్టమైన కార్ బ్రాండ్‌లలో ఒకటిగా మారింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు కియా EV6ని రెండు సంవత్సరాల క్రితం జూన్ 2022లో భారతదేశంలో విడుదల చేసింది. ఈ అధిక బడ్జెట్ ఎలక్ట్రిక్ SUV భారతీయ వినియోగదారులకు బాగా నచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన వేలాది మంది కస్టమర్లకు పెద్ద షాక్ తగిలింది. కార్లను కంపెనీ రీకాల్ చేసింది.


అసలు విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో సమస్య కారణంగా కియా ఇండియా 1,138 యూనిట్ల EV6లను రీకాల్ చేసింది. ఈ సమస్య కారణంగా 12V సెకండరీ బ్యాటరీ పనితీరు ప్రభావితం కావచ్చు. ఇది సీరీగా పనిచేయలేకపోవచ్చు.

మార్చి 3, 2022, ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేయబడిన EV6 SUV యూనిట్లను కంపెనీ రీకాల్ చేసింది. Kia EV6 మాదిరిగానే హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం ఒక నెల క్రితం ఇదే రీకాల్ జారీ చేయబడింది. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత యూనిట్లలోని ఐసీసీయూ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తామని కంపెనీ తెలిపింది.


Also Read: Bajaj Freedom CNG Bike Mileage: బజాజ్ CNG.. ఇలా చేస్తే ఎక్కువ మైలేజీ!

ఈ రీకాల్ గురించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి తెలియజేసినట్లు కొరియన్ బ్రాండ్ కియా తెలిపింది. కంపెనీ ఈ కార్ల యజమానులను సంప్రదిస్తుంది. ఈ రీకాల్ గురించి వారికి తెలియజేస్తుంది. ఈ రీకాల్ కింద అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి యజమానులు తమ కియా డీలర్‌లకు కాల్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

Kia EV6 Features
Kia EV6 77.4kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇందులో సింగిల్ మోటార్ రియర్-వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లు ఉన్నాయి. సింగిల్ మోటార్ వెర్షన్ 229hp పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్ 325hp పవర్, 605Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది 708km వరకు ARAI రేంజ్ అందిస్తుంది.

Also Read: Upcoming Hybrid Cars: టాప్ లేచిపోద్ది.. యూత్ కోసం హైబ్రిడ్ కార్లు.. త్వరలోనే లాంచ్!

కియా EV6 ధర విషయానికి వస్తే భారతదేశంలో Kia EV6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 64.11 లక్షల నుండి రూ. 69.35 లక్షల మధ్య ఉంటుంది. BMW iX1, Volvo XC40 రీఛార్జ్, C40 రీఛార్జ్.  ఇటీవల ప్రారంభించిన Mercedes EQA వంటి ఎంట్రీ-లెవల్ లగ్జరీ SUVలతో దాని పోటీ ఉంటుంది.

Related News

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Train Tickets Cancel: కౌంటర్‌లో కొన్న రైలు టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవడం ఎలా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి చాలు!

Gold and Silver Prices: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Big Stories

×