EPAPER

Jasprit Bumrah Car Collection: టీమిండియా బౌలర్ బుమ్రా ఉపయోగించే కార్లు చూసారా? ధరలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Jasprit Bumrah Car Collection: టీమిండియా బౌలర్ బుమ్రా ఉపయోగించే కార్లు చూసారా? ధరలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Team India Bowler Bumrah Car Collection: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువగా టాక్, వ్యూస్ తెచ్చుకున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇందులో T20 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి భారత్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ బ్యాట్‌తో పెద్దగా రాణించలేక పోయినా.. బౌలర్లు చక్కటి బంతులతో నిప్పులుచెరిగి పాక్ బ్యాటర్లకు షాక్ ఇచ్చారు.


భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ తక్కువ స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాక్ బ్యాట్స్‌మెన్‌లను ఎక్కువసేపు పిచ్‌పై ఉండనివ్వలేదు. ఈ క్రమంలో బుమ్రా హాట్‌టాపిక్‌గా మారారు. ఇందులో భాగంగా బుమ్రా ఉపయోగించే కార్లేవి? ఎటువంటి మోడల్స్ ఉన్నాయి? వాటి ధర, తదితర వివరాలు తెలుసుకుందాం.

రేంజ్ రోవర్ వెలార్
జస్ప్రీత్ బుమ్రాకు చెందిన లగ్జరీ కార్లలో ఒకటి రేంజ్ రోవర్ వెలార్, ఇది 201 bhp అవుట్‌పుట్‌తో 2-లీటర్ డీజిల్ మైల్డ్-హైబ్రిడ్. ఈ SUV 8.3 సెకన్లలో 0 – 100 kmph స్పీడ్ అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 210 kmph. మరోవైపు పెట్రోల్ వెర్షన్ 246 bhp 2-లీటర్ 4-సిలిండర్ ద్వారా పవర్ పొందుతుంది. ఇది 7.5 సెకన్లలో 0 – 100 bhp వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 217 kmph. Velar ఎక్స్-షోరూమ్ ధర రూ.87.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది.


Also Read: టాటాతో పోటీకి సిద్ధమైన హ్యుందాయ్.. 355 కిమీ రేంజ్‌తో కొత్త ఈవీ

మెర్సిడెస్ మేబ్యాక్ S560
Mercedes Maybach S560 48V మైల్డ్ హైబ్రిడ్‌తో 4-లీటర్ ట్విన్-టర్బో ఛార్జ్‌డ్ V8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 496 బిహెచ్‌పి, 700 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ కారు 0- 100 kmph వేగాన్ని ఈ సెడాన్ 4.8 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 250 kmph. మేబ్యాక్ S560 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.72 కోట్లతో ప్రారంభమవుతుంది.

నిస్సాన్ GT-R
నిస్సాన్ దీనిని గాడ్జిల్లా అని పిలుస్తుంది. నిస్సాన్ ఈ GTR 565 bhp పవర్, 637 Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 3.8-లీటర్ V6 ట్విన్-టర్బో ఇంజన్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్, ఆరు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. నిస్సాన్ జిటి-ఆర్ ధర దాదాపు రూ.2.45 కోట్లు.

Also Read: వావ్.. ప్రపంచంలోనే తొలి CNG బైక్.. ఇక పెట్రోల్ అక్కర్లేదు..!

టయోటా ఇన్నోవా క్రిస్టా
జస్ప్రీత్ బుమ్రాకు టొయోటా ఇన్నోవా క్రిస్టా MVP వేరియంట్ ఉంది. ఇది లాంచ్ సమయంలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌‌తో వచ్చింది. కానీ ఇప్పుడు డిజిల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 343 Nmతో 2.4-లీటర్ 148 bhp ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 7-సీటర్,  8-సీటర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×