Big Stories

Home Loan:- ఇంటి రుణం 15 ఏళ్ల పాటు కట్టడం కరెక్టేనా?

Home Loan:- హోమ్ లోన్ తీసుకోవాలా వద్దా. అద్దెకు ఉండడమే బెటరా. దీనిపై జరిగే పితలాటకం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఇంటి రుణం తీసుకుంటే 15 ఏళ్ల పాటు కడుతూనే ఉండాలి. హమ్మయ్య… ఇంటి రుణం తీరిపోయింది అనుకునే సమయానికి రిటైర్మెంట్ వయసు దగ్గర పడొచ్చు. అప్పుడు ఇళ్లు చేతికి వచ్చినా.. అంత సంతోషం ఉంటుందా. డౌటే. పైగా 15 ఏళ్ల జీవితంలో ఇంటి రుణం కట్టడం కోసం చాలా విషయాల్లో కడుపు కట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలను పెంచే విషయంలోనైనా, ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలోనైనా కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. పోనీ, కాంప్రమైజ్ అయినా… 15 ఏళ్ల తరువాత ఆ పిల్లలు పెళ్లీడుకు రావొచ్చు, పెళ్లి చేసుకుని కూడా వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు.. ఇన్నేళ్ల పాటు ఖర్చులు తగ్గించుకుని, అయ్యయ్యో.. జీవితంలో ముఖ్యమైన సంతోషాలను వాయిదా వేశామే అని అప్పుడు బాధపడే సందర్భం రాదంటారా.

- Advertisement -

అయితే, ఇందులో మరో వర్షన్ కూడా ఉంది. ఈ 15 ఏళ్ల పాటు సొంతిట్లో ఉన్నామన్న తృప్తి కలుగుతుంది. ఇంటి ఓనర్లతో మాట పడాల్సిన అవసరం రాదు. పైగా మీరు కట్టే అద్దెనే.. ఈఎంఐగా కడుతున్నాం అని అడ్జస్ట్ అయిపోవచ్చు. పోనీ, మీరు తీసుకున్న ఇంటికి ఎక్కువ అద్దె వచ్చేటట్టైతే ఇంకా సంతోషమే. తక్కువ అద్దె వచ్చే ఇంట్లో మీరు ఉంటూ.. ఈ ఇంటి అద్దెను ఈఎంఐలో కొంతైనా భర్తీ చేయొచ్చు. భాగస్వామి కూడా సంపాదిస్తూ ఉంటే.. 15 ఏళ్ల పాటు ఈఎంఐ కట్టడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయినా.. మీకంటూ ఒక ఇల్లు ఉంటుంది. పదవీ విరమణ లేదా సీనియర్ సిటిజన్స్ అయిన మీకు ఆ ఇల్లే ఒక అండగా ఉంటుంది. 15 ఏళ్ల తరువాత ఇంటి పత్రాలు మీ చేితికి వస్తాయి కాబట్టి… మరేదైనా అవసరాల కోసం ఆ ఇంటిని తనఖా పెట్టి మార్ట్ గేజ్ లోన్ తీసుకోవచ్చు.

- Advertisement -

కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే.. నెలకు 50వేలు ఈఎంఐగా కట్టే కంటే.. దాన్నే ఇన్వెస్ట్ మెంట్ గా మారిస్తే 15 ఏళ్లలో బోలెండం సంపాదించొచ్చు. సపోజ్.. 50 లక్షల ఇంటి లోన్ తీసుకుని నెలకు 50వేల వాయిదా కడుతుంటే.. 15 ఏళ్లకు 90 లక్షలకు పైగా కట్టాల్సి ఉంటుంది. అదే 50వేలను నెల నెలా స్టాక్ మార్కెట్లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో లేదా మరేదైనా మంచి బిజినెస్‌కో పెడితే.. మీరు కట్టాల్సిన దానికంటే ఎక్కువ లాభం రావొచ్చు. కాకపోతే.. మీరు ఉంటున్న ఇంటి అద్దె తక్కువదై ఉండాలి. సో, ఈ మూడు ఆప్షన్లను బట్టి ఇంటి రుణం తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా అనేది మీరే ఆలోచించుకోండి. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News