Big Stories

Savings Scheme : సేవింగ్స్ స్కీమ్ నుంచి ముందే విత్‌డ్రా చేసుకుంటే మంచిదేనా? ఎంత పెనాల్టీ కట్టాలి?

- Advertisement -

Savings Scheme : సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసులో ఇన్వెస్ట్‌మెంట్ ఒక బెస్ట్ ఆప్షన్. ఎలాంటి టెన్షన్ తీసుకోనక్కర్లేదు. నష్ట భయం అస్సలే ఉండదు. టంచనుగా వడ్డీ పడుతుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి ఇంట్రస్ట్ అమౌంట్ అకౌంట్లో పడుతుంది. అటు అసలు మొత్తానికి కూడా రక్షణ ఉంటుంది. కాకపోతే, ఇందులో ఉండే నష్టం ఏంటంటే.. ఇంట్రస్ట్ రేటు పెరగవు. పెట్టుబడి పెట్టే సమయంలో ఎంత వడ్డీ చెల్లిస్తామని ఉంటుందో స్కీమ్ అయిపోయే వరకు అంతే ఉంటుంది. అంటే, ఐదేళ్ల పాటు అదే 8 శాతం వడ్డీ రేటు ఇస్తుంది తప్ప.. మధ్యలో వడ్డీరేట్లు పెరిగాయి కదా అని వడ్డీ పెంచి ఇవ్వదు. అదొక్కటే మైనస్.

- Advertisement -

ఒకవేళ సీనియర్ సిటిజన్ స్కీమ్ కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ దొరికినప్పుడు… పోస్టాఫీస్ సేవింగ్స్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే, ఐదేళ్ల కాలపరిమితితో ప్రారంభించిన సేవింగ్స్ స్కీమ్‌ను ఫాం-2 సబ్‌మిట్ చేసి ముందుగానే ఆ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. కాకపోతే, ఇందుకోసం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సేవింగ్స్ స్కీమ్ స్టార్ట్ చేసిన ఏడాది లోపు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి వడ్డీ ఇవ్వరు. ఒకవేళ అప్పటికే మూడు నెలల వడ్డీని చెల్లించినట్టైతే.. అసలులోంచి మినహాయించుకుని మిగతాది ఇస్తారు. అదే ఏడాది నుంచి రెండేళ్ల లోపు డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటే మాత్రం.. పెనాల్టీ కింద 1.5 శాతం కట్టించుకుంటారు. రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటే.. చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌పై 1 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో మరో మంచి ఆప్షన్ ఉంది. ఈ డిపాజిట్ స్కీమ్ కాల పరిమితి ఐదేళ్లే అయినప్పటికీ.. మరో ఏడాది పాటు పొడిగించుకోవచ్చు. ఆరేళ్లు ముగిసిన తరువాత వడ్డీతో కలిపి అసలు మొత్తాన్ని తీసుకోవచ్చు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News