BigTV English

Instagram’s New Feature: టీనేజర్ల కోసం ఇన్‌స్టా కొత్త ఫీచర్..

Instagram’s New Feature: టీనేజర్ల కోసం ఇన్‌స్టా కొత్త ఫీచర్..

Instagram’s New Feature:స్మార్ట్ ఫోన్లు, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. చాలా మంది టీనేజర్లు ఎక్కువ సమయం వాటికే కేటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో 24 గంటలూ యాక్టివ్ గా ఉంటూ… మిగతా విషయాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వివిధ మాధ్యమాల్లో లెక్కలేనన్ని పోస్టులు పెట్టి… వాటికి ఎన్ని లైకులు వచ్చాయి? ఎన్ని షేర్లు వచ్చాయి? అని అదే పనిగా చూసుకుంటూ… చదువు, నిద్ర వంటి అంశాలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. దాంతో చాలా మంది అటు చదువుకు దూరమై, ఇటు ఆరోగ్యం దెబ్బతిని సతమతమవుతున్నారు. ఇకపై టీనేజర్లు అలాంటి ఇబ్బందులు పడకుండా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది… ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. క్వైట్ మోడ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా… అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సోషల్ మీడియా లైఫ్ బ్యాలెన్స్ చేయవచ్చని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.


క్వైట్ మోడ్ ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా… యాప్ నుంచి నిశ్చింతగా విరామం తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. ఈ ఫీచర్ ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లను నిశ్శబ్దంగా ఉంచడంతో పాటు… ఆటోమేటిక్ రిప్లై ఇవ్వడం, ప్రస్తుతం యాప్‌లో యాక్టివ్‌గా లేరని స్నేహితులకు తెలియజేయడం వంటి పనులు చేస్తుంది. అంతేకాదు… స్టడీస్‌పై ఫోకస్ చేసేందుకు, తగినంత సమయం నిద్రపోయేందుకు క్వైట్ మోడ్ బాగా ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. టైమ్ మేనేజ్‌మెంట్ టూల్స్ విభాగాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగానే క్వైట్ మోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

క్వైట్ మోడ్ ఫీచర్‌తో పాటు… టీనేజర్ల భద్రత కోసం కూడా ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఫీచర్లు ప్రవేశపెట్టింది. యాప్ మీద తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా మార్పులు తీసుకొచ్చింది. గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం టైమ్ మేనేజ్‌మెంట్ టూల్స్ ప్రవేశపెట్టింది. యాప్‌లో ఎంత సేపు గడిపారనే విషయాన్ని తెలుసుకోవడం, ట్రాక్ చేయడం, నియంత్రించడం వంటి ఫీచర్లు ఇప్పటికే యాప్‌లో ఉండగా… వాటికి భిన్నంగా క్వైట్ మోడ్ లాంచ్ చేసింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×