EPAPER

VIKAL Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

VIKAL Yojana:  పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

VIKALP Yojana Scheme: దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లు వెళ్తుంటారు. వీరిలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా జర్నీ చేసే ఉద్దేశంతో ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే, పండగ సమయంలో రైలు టికెట్ బుక్ చేసుకోవం అంత ఈజీ కాదు. పరిమితికి మించి ప్రయాణీకులు వచ్చే అవకాశం ఉండటంతో అందరికీ సీటు ఇవ్వడం రైల్వే అధికారులకు సాధ్యం కాదు. అయితే, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా టిక్కెట్లు అందించేందుకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరిన్ని టిక్కెట్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే  VIKALP యోజనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా కచ్చితంగా టికెట్ పొందే అవకాశం ఉంటుంది.


VIKALP యోజనతో లాభం ఏంటంటే?

భారతీయ రైల్వే సంస్థ తీసుకొచ్చిన VIKALP యోజన ద్వారా ప్రయాణీకులు ఒకేసారి పలు రైళ్లను ఎంపిక చేసుకోవచ్చు.  ప్రయాణీకుడు సీటు అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే అవకాశాన్ని పొందుతాడు. రైల్వే ప్రయాణ డేట్ కు సుమారు నాలుగు నెలలు అంటే 120 రోజుల ముందు VIKALP యోజనలో టిక్కెట్ల బుకింగ్‌ను అనుమతిస్తారు.  అత్యవసర ప్రయాణం కోసం తత్కాల్ సౌకర్యాన్ని ఉపయోగించి జర్నీకి ఒక రోజు ముందు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.


VIKALP పథకాన్ని ఎలా ఎంచుకోవాంటే?

ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామొడేషన్(ATAS) పథకానికి రైల్వే అధికారులు VIKALP యోజన అని పేరు పెట్టారు. ఈ పథకం ద్వారా ప్రయాణీకులకు కన్ఫాయ్ చేయబడిన టిక్కెట్లను పొందే అవకాశం ఉంటుంది.  మీరు ఆన్‌ లైన్‌ లో టిక్కెట్‌ ను బుక్ చేసినప్పుడు, ఆటోమేటిక్ గా VIKALP అప్షన్ సూచించబడుతుంది. ఆ ఆప్షన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న రైలుకు వెయిటింగ్ టికెట్ ఉంటే ఆ మార్గంలో ఇతర రైళ్లను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రత్యామ్నాయ రైలులో సీటు అందుబాటులో ఉంటే, ఆ రైలులో మీకు ఆటోమేటిక్‌గా సీటు కేటాయించబడుతుంది. మీరు బుక్ చేసిన టిక్కెట్ల హిస్టరీని చూడ్డం ద్వారా టిక్కెట్ ఏ రైలులో బుక్ అయ్యిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఒకేసారి 7 రైళ్లను ఎంచుకునే అవకాశం

VIKALP యోజన కింద, ప్రయాణీకులు బోర్డింగ్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి 30 నిమిషాల నుంచి 72 గంటలలోపు నడిచే 7 రైళ్లను ఎంచుకోవచ్చు. ఇలా ఎంపిక చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఏదో ఒక రైలులో టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, నూటికి నూరు శాతం టికెట్ కన్ఫామ్ కావాలనే రూల్ ఏమీ లేదు. ఎంచుకున్న రైళ్లలో సీట్ల లభ్యతపై ఆధారపడి టిక్కెట్ బుకింగ్ కన్ఫామ్ అనేది ఉంటుంది. మొత్తానికి ఈ యోజన ద్వారా చాలా వరకు టికెన్ పొందే అవకాశం ఉంటుంది.

Read Also:రండి బాబు.. రండి.. ఫ్రీగా విమానంలో ప్రయాణించండి, దేశమంతా ఉచితంగా చుట్టేయండి

Related News

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

IRCTC Special Discounts: రైళ్లలో ఈ ప్రయాణీకులకు ఏకంగా 75 శాతానికి పైగా టికెట్ ధర తగ్గింపు, ఎందుకో తెలుసా?

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

Best Schemes for Girl Child: ఇంత పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం – ఆడ బిడ్డకు భవిష్యత్‌కు భరోసా ఈ ప్రభుత్వ పథకాలు

Free flight tickets: రండి బాబు.. రండి.. ఫ్రీగా విమానంలో ప్రయాణించండి, దేశమంతా ఉచితంగా చుట్టేయండి

Indian Railway: ఈ రైల్ కోచ్‌లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్.. ఎక్కడో కాదు, మన దగ్గరే!

Big Stories

×