EPAPER

Hydrogen Train: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hydrogen Train: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Indian Railways 1st Hydrogen Train: భారతీయ రైల్వే సంస్థ గత దశాబ్ద కాలంలో అత్యాధునిక హంగులతో దూసుకెళ్తోంది. సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతోంది. వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వేల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. హై స్పీడ్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది.  వందే భారత్ తో పాటు వందే భారత్ మెట్రో రైళ్లు ఇప్ప ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వందే భారత్ రైళ్లు రోజు రోజుకు సరికొత్త అప్ డేట్స్ తో ప్రయాణీకులకు మెరుగైనసేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ ను తలదన్నే రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇంతకీ ఆ రైలు ఏంటి? దాని ప్రత్యేకతలు ఏంటంటే..?


త్వరలో భారత్ లో హైడ్రోజ్ రైలు పరుగులు

వందే భారత్ కు మించిన వేగం, అంతకు మించిన ప్రత్యేకలతో రాబోతున్న సరికొత్త రైలు మరేదో కాదు హైడ్రోజన్ రైలు. ఈ ఏడాది చివరిలోగా ఈ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లో హైడ్రోజన్ రైలుకు సంబంధించిన భద్రతా వ్యవహారాలను పరిశీలించేందుకు జర్మనీకి చెందిన టీయూవీ- ఎస్‌యూడీ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ సైతం ఈ సంస్థే పర్యవేక్షించనుంది.


హైడ్రోజన్ రైలు ఖరీదు ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోల్చితే హైడ్రోజన్ రైలు అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో రైలు యూనిట్ ధర సుమారు రూ. 10 కోట్లు ఉంటుంది.  రైలుకు సంబంధించి గ్రౌండ్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.70 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే, ఒక్కో రైలుకు సుమారు రూ. 80 కోట్లు అవుతుంది. భారత్ లో తొలి దశలో 35 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైలుకు సంబంధించి సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, ప్యూయెల్ యూనిట్లను ఇప్పటికే టెస్ట్ చేశారు. అన్ని పరీక్షలు సక్సెస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలులో 4 కోచ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గంటకు 140 కిమీ వేగంతో ప్రయాణించనుంది.

తొలి హైడ్రోజన్ రైలు ఎక్కడ నడుస్తుందంటే?

భారత్ లో తొలి హైడ్రోజన్ రైలును హర్యానాలోని  జింద్-సోనిపట్ మధ్య నడవనున్నది. నార్త్ రైల్వే జోన్ కింద ఈ రైలు తన సేవలు అందించనుంది. ఈ రైళ్లకు సరిపడ హైడ్రోజన్ ను జింద్‌లో ఉన్న 1 MW పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుంచి అందించనున్నారు. ప్రస్తుతం అక్కడ రోజుకు సుమారు 430 కిలోల హైడ్రోజన్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. 3 టన్నుల హైడ్రోన్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. హైడ్రోజన్ రైళ్ల వినియోగం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు.

హైడ్రోజన్ రైళ్లను నడిపే ఐదో దేశంగా భారత్

ఇప్పటి వరకు హైడ్రోజన్ రైళ్లు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే హైడ్రోజన్ రైళ్లు నడిచే ఐదో దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకోనుంది. ఇక ఈ రైలును నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘైతో పాటు మార్వార్ దేవ్‌గర్ మదారియా  రూట్లలో నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది.

Read Also: సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Related News

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

×