EPAPER

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Vande Bharat Sleeper: భారతీయ  రైల్వే వ్యవస్థను వందే భారత్ రైళ్లు కీలక మలుపు తిప్పాయి. అత్యాధునిక రైళ్ల ఎంట్రీతో ఇండియన్ రైల్వేస్ ముఖ చిత్రం మారిపోయింది. ఎప్పటికప్పుడు వందే భారత్ రైళ్లు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో స్లీపర్ రైలు పట్టాలు ఎక్కబోతోంది. ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ రైలు త్వరలోనే తన సేవలను ప్రారంభించబోతుంది. సుదూర రాత్రి ప్రయాణాలకు అనుకూలంగా ఈ రైలు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైన్ కు సంబంధించిన బోగీలు చెన్నై ఐసీఎఫ్‌ (ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ)లో తుది మెరుగులు అద్దుకుంటున్నాయి.  టెస్టింగ్ కోసం రెడీ చేసిన ఓ బోగీని తాజాగా అధికారులు మీడియాకు చూపించారు. ఇందులోని సౌకర్యాల ముందు లగ్జరీ హోటల్ కూడా దిగదుడుపే అనేలా ఉన్నాయి.


160 కి. మీ వేగం.. 1,200 కి.మీ ప్రయాణం

త్వరలో అందుబాటులోకి రానున్న ఈ స్లీపర్ రైలు గంటకు గరిష్టంగా 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రైలు  ఏక బిగిన 1,200 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఈ రైలులో విమాన తరహాలోనే అత్యధునిక ఏర్పాట్లు చేశారు. మొబైల్‌ ఛార్జింగ్, మ్యాగజైన్లు, టేబుల్, చిన్న లైట్, వస్తువులు పెట్టుకునేందుకు విశాలమైన ప్లేస్, స్నానానికి  వేడి నీళ్లు, భద్రత కోసం సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో లోకో పైలెట్ తో మాట్లాడే సౌకర్యం సహా  బయో వాక్యూమ్‌ వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు.  జీఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్‌, లగ్జరీ కుషన్‌ ఫోమ్‌ తో ఏర్పాటు చేసిన బెర్తులు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చనున్నాయి.


ఒక్కో రైలుకు 16 కోచ్ లు, తయారీ ఖర్చు రూ. 120 కోట్లు

వందే భారత్ స్లీపర్ రైలు 16 కోచ్ లను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్‌ మెంట్‌ లో 24 మంది ప్రయాణించవచ్చు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌ లో 188 మంది జర్నీ చేసే అవకాశం ఉంది. థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లలో 611 మంది ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా ఒక రైలను 823 మంది ప్రయాణించేలా రూపొందించారు. ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదరణను బట్టి కోచ్ ల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఇక ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలు తయారీకి  రూ. 120 కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా 77 మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లు

ఐసీఎఫ్‌లో 2018 నుంచి వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. ఇక్కడ తయారైన వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 77 మార్గాల్లో నడుస్తున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రైళ్లు కేవలం కూర్చునేందుకు అనుకూలంగా ఉన్నయి. త్వరలో అందుబాటులోకి రాబోయే వందే భారత్ స్లీపర్ రైళ్లలో పడుకుని హాయిగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ స్లీపర్ రైలు వచ్చే ఏడాది జనవరిలో పట్టాలు ఎక్కనుంది.

Read Also: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Related News

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Today Gold Prices: పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Big Stories

×