మీ ITR ను ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలంటే..
ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ ప్రొఫైల్ నమోదు చేసుకోవాలి. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సేవలను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ చాలా అవసరం. ప్రొఫైల్ పూర్తి చేయడానికి.. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి, మీ పుట్టిన తేది, ఇంటి చిరునామా వంటి వివరాలు తెలియజేయండి.
Income Tax Return filing news(Business news telugu): భారతదేశంలో ఆదాయపు చెల్లించే పౌరులందరూ ఆదాయపు పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలు చేస్తే.. రుణాలు, వీసాలు, ప్రభుత్వ టెండర్లు, ఆదాయపు రుజువుగా ఇది ఉపయోగం పడుతుంది. ITR ఫైల్ చేయడం వల్ల మరో పెద్ద ప్రయోజనం ఉంది. మీరు అధిక ఆదాయపు పన్ను చెల్లించినట్లైతే.. పన్ను వాపసు క్లెయిమ్ చేసుకోవచ్చు.
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ITR దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 31, 2024 (బుధవారం) వరకు మీరు ITR దాఖలు చేయడానికి గడువు ఉంది.
ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ITR ఫైలింగ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియ విధానం ఆధునీకరించడంతో చాలా ఈజీగా ఉంది. పోర్టల్ లో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సౌకర్యవంతంగా సమర్పించవచ్చు.
మీ ITR ను ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలంటే..
ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ ప్రొఫైల్ నమోదు చేసుకోవాలి. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సేవలను యాక్సెస్ చేయడానికి మీ ప్రొఫైల్ చాలా అవసరం. ప్రొఫైల్ పూర్తి చేయడానికి.. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి, మీ పుట్టిన తేది, ఇంటి చిరునామా వంటి వివరాలు తెలియజేయండి.
మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ IDకి పంపబడిన OTP ద్వారా మీ గుర్తింపును ధృవీకరించండి.
మీ ఖాతా కోసం పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
నమోదును పూర్తి చేసి, లాగిన్ చేయడానికి కొనసాగండి.
ITRని ఇ-ఫైలింగ్ ఎలా చేయాలంటే..
మీ ఆధారాలను ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
మీ ప్రొఫైల్ సమాచారాన్ని అప్ డేట్ చేయండి.
‘ఈ-ఫైల్’ విభాగానికి నావిగేట్ చేసి, ‘ఆదాయ పన్ను రిటర్న్స్’ ఎంచుకోండి.
‘ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్’పై క్లిక్ చేయండి.
సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ మరియు ఫైలింగ్ స్టేటస్ ఎంచుకోండి.
తగిన ITR ఫార్మ్ (ఒరిజినల్ లేదా అప్ డేటెడ్) ఎంచుకోండి.
ఆన్ లైన్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్ మిట్ ఫార్మ్ సబ్ మిట్ చేయండి.
Also Read: Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?
మీ ITRని కచ్చితంగా సమయానికి ఫైల్ చేయడం చాలా కీలకం. మీ ఆదాయపన్ను రిటర్న్ క్లెయిమ్ చేయడానికి ఇది చాలా అవసరం. ఆదాయపు పన్ను ఫైలింగ్ చేయడం ద్వారా మీ పన్ను బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చినట్లు నిర్ధారణ అవుతుంది.