EPAPER

Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

Parle-G Success Story: పార్లేజీ.. జీ అంటే ఎనర్జీ, బాల్యం కంటే గొప్ప పాఠశాల లేదు.. పార్లే జీతో రేపటి మేధావులను సృష్టిద్దాం అంటూ వచ్చే యాడ్స్ మనందరికి గుర్తుండే ఉంటాయి. ఈ అడ్వటైజ్‌మెంట్లతో ఈ బిస్కెట్ల కంపెనీ మార్కెట్‌లో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగింది. కొన్నేళ్ల క్రితం సాయంత్రం స్నాక్స్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పార్లేజీ బిస్కెట్లు. అమ్మా ఆకలి అని పిల్లవాడు కేకలు వేయగానే ఆమె పార్లేజీ బిస్కెట్లను ఎంతో ప్రేమతో అందించేంది.


ఆ జ్ఞాపకాలు ఇప్పటికి చాలా మంది మదిలో ఉండిపోయాయి అనడంలో అతిశయోక్తి కాదు. ఆ సమయంలో అందరి బాల్యం పార్లే జీతోనే గడిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా పార్లేజీ ప్యాకెట్‌పై ఉండే చిరునవ్వులు ఇప్పటికి మారలేదు. కొందరు తల్లలు పార్లేజీపై ఉన్న చిన్నారి బొమ్మతో తమ బిడ్డలను చూసుకొని మురిసిపోతుంటారు. ఈ కంపెనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వదేశీ ఉద్యమం సమయంలో పార్లేజీ బిస్కెట్‌కు పునాది పడింది. మోహన్‌లాల్ దయాల్ చాక్లెట్ కంపెనీ పెట్టాలనుకున్నాడు, కానీ తరువాత అతను బిస్కెట్లు తయారు చేయాలని అనుకున్నాడు. నిజానికి 1905లో స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావడంతో విదేశీ వస్తువుల బహిష్కరణ మొదలైంది. అప్పట్లో బిస్కెట్లను ధనవంతుల స్నాక్స్‌గా భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు, దేశంలోని రాజులు, చక్రవర్తులు మాత్రమే బిస్కెట్లు కొని తినగలరు. కాబట్టి మోహన్‌లాల్ దయాల్ స్వదేశీ బిస్కెట్‌లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.


పార్లేజీ పేరుకు సంబంధించిన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. పార్లేజీ కంపెనీని ప్రారంభించడానికి మోహన్‌లాల్ దయాల్ ముంబైలోని ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. విలే పార్లే ప్రాంతంలో బిస్కెట్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. అతను తన బిస్కెట్‌కి ఈ ప్రదేశానికి గుర్తుగా ‘పార్లే’ అని పేరు పెట్టాడు. తర్వాత పార్లే బిస్కెట్ ‘పార్లే గ్లూకో’గా మారింది. మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా కంపెనీ గ్లూకోను గ్లూకోజ్ మూలంగా పార్లే బిస్కెట్ పేరుకు జోడించింది. కొంత కాలం తరువాత గ్లూకో తొలగించి ‘G’ గా మార్చింది. G అంటే.. ‘పార్లే జీ.. జీ ఫర్ మేధావి.’

2011లో ఒక నివేదిక ప్రకారం పార్లేజీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్. పార్లేజీ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు జర్మనీ నుంచి రూ.60 వేల విలువైన మిషనరీ కొనుగోలు చేశారు. 12 మంది ఉద్యోగుల సహకారంతో పార్లేజీ బిస్కెట్లు సిద్ధం చేశారు. తక్కువ సమయంలోనే పార్లేజీ దేశంలో అత్యధికంగా వినియోగించే బిస్కెట్‌గా మారింది. పార్లేజీ బిస్కెట్ 1938లో ప్రపంచానికి పరిచయం చేయబడింది. పార్లేజీ భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

పార్లే జీ చాలా పెద్ద బ్రాండ్‌లను దాటేసింది. 2020 నివేదిక ప్రకారం పార్లేజీ గత 2 సంవత్సరాలలో 8000 కోట్ల రూపాయల విలువైన బిస్కెట్లను విక్రయించింది. మొనాకో, క్రాక్‌జాక్, మిలో, హైడ్ అండ్ సీక్ వంటి అనేక బిస్కెట్లు పార్లే కంపెనీకి చెందినవి. భారతదేశంతో పాటు పార్లేజీకి 6 దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం పార్లేజీ కంపెనీ యజమాని విజయ్ చౌహాన్ నికర విలువ 5.5 బిలియన్ డాలర్లు అంటే రూ. 45.579 కోట్లు.

Related News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Electronics ‘repairability index’: ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఇకపై రిపేరెబిలిటీ ఇండెక్స్.. త్వరలో చట్టం తీసుకురానున్న కేంద్రం!

Big Stories

×