E-Paper
Advertisement

Lamborghini Cars: లగెత్తిన లంబోర్గిని సేల్స్

Lamborghini Cars: లగెత్తిన లంబోర్గిని సేల్స్
Advertisement

Lamborghini Cars:ఇటాలియన్ మేడ్ సూపర్ కార్ లంబోర్గినికి… భారత దేశంలో భారీ ఆదరణ దక్కుతోంది. 2022లో దేశంలో మొత్తం 90 లంబోర్గిని కార్లు అమ్ముడుపోతే… ఈ ఏడాది ఇంకా ఫిబ్రవరి కూడా ముగియక ముందే… ఏకంగా 90 కార్లకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఏడాది భారత్‌లో మొత్తం 100 కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్న లంబోర్గిని కంపెనీ… రెండు నెలల్లోనే 90 కార్లకు ఆర్డర్స్ రావడంతో తెగ సంబరపడిపోతోంది. ఇండియాలో తాము టార్గెట్‌ రీచ్‌ అయ్యామని తెలిపింది. ఈ 90 కార్లను అల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులే బుక్ చేశారని… లంబోర్గిని ఏషియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని చెప్పారు.

ఉరుస్ లగ్జరీ ఎస్‌యూవీ, అవెంటడోర్, హురాకాన్ వంటి లగ్జరీ కార్లను లంబోర్గిని భారత్‌లో విక్రయిస్తోంది. ఇక్కడ లంబోర్గిని అన్ని మోడళ్ల కార్ల ధరలు రూ.4 కోట్లకు పైమాటే. ఇంత భారీ ధర ఉన్నా… సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్స్ లంబోర్గిని కార్లను తెగ కొనేస్తున్నారు. దేశంలో లంబోర్గిని కార్ల అమ్మకాల్లో ఏడాదికి 30 శాతం వృద్ధి కనిపిస్తోంది. అందుకే… అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లంబోర్గిని మార్కెట్లలో ఇండియా ఒకటి అని ఆ కంపెనీ చెబుతోంది.

Advertisement

కొవిడ్ తర్వాత లంబోర్గిని కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్‌లో డిమాండ్ పెరిగింది. 2022లో ఒక్క చైనాలోనే 1000 లంబోర్గిని కార్లను విక్రయించింది… ఆ కంపెనీ. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా ఈ ఏడాది బుకింగ్స్ కూడా పూర్తి చేసింది… లంబోర్గిని. ఇప్పుడు 2024 ఏడాదికి ఆర్డర్లు తీసుకుంటోంది… ఆ కంపెనీ. బుక్ చేసుకున్న లంబోర్గిని కారును డెలివరీ చేయాలంటే… కనీసం ఏడాదిన్నర సమయం పడుతోంది. లంబోర్గిని కార్లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా బుకింగ్స్ రావడంపై… ఆ కంపెనీయే ఆశ్చర్యపోతోంది. వందల కార్లకు బుకింగ్స్ వస్తాయని తాము అస్సలు ఊహించలేమంటోంది.

Adani: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అదానీ..

Advertisement

Gold rates : నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×