EPAPER

Hero Xoom Combat Edition: హీరో నుంచి ‘జూమ్ కంబాట్ ఎడిషన్’ వచ్చేసింది.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Hero Xoom Combat Edition: హీరో నుంచి ‘జూమ్ కంబాట్ ఎడిషన్’ వచ్చేసింది.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Hero Xoom Combat Edition Launched at Rs 80,967: భారత మార్కెట్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన కంపెనీల్లో హీరో మోటోకార్ప్ ఒకటి. కంపెనీ కొత్త కొత్త టూ వీలర్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. లుక్, డిజైన్, ఫీచర్ల పరంగానే కాకుండా బడ్జెట్ ధరలో రకరకాల మోడళ్లను రిలీజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో రకాల మోడళ్లను, వేరియంట్లను తీసుకొచ్చిన హీరో కంపెనీ ఇప్పుడు మరొక మోడళ్‌ను భారత మార్కెట్‌లో పరిచయం చేసేంది.


హీరో మోటోకార్ప్ భారతదేశంలో తన జనాదరణ పొందిన జూమ్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఫైటర్ జెట్‌ల నుండి ప్రేరణ పొందిన ‘జూమ్ కంబాట్ ఎడిషన్’ను తీసుకొచ్చింది. సాధారణ జూమ్ మోడల్‌తో పోలిస్తే ఇది ప్రత్యేకమైన కలర్ స్కీమ్, స్పోర్టియర్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది.

Hero Xoom Combat ఎడిషన్ కొత్త షేడ్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు ఫైటర్ జెట్‌ల ద్వారా ప్రేరణ పొందాయి. ఈ డిజైన్ విమానయాన ఔత్సాహికులను, అలాగే యువతను బాగా ఆకర్షిస్తుంది. డిజైన్ స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఉన్నప్పటికీ, స్కూటర్ దాని ప్రత్యేకమైన కాంట్రాస్టింగ్ కలర్స్ కారణంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ పోల్‌స్టర్ బ్లూ, బ్లాక్, ఆకర్షించే మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెరల్ సిల్వర్ వైట్‌లతో సహా అనేక ఇతర కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.


Also Read: స్ప్లెండర్ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. కేవలం రూ.82,911లకే లాంచ్.. ఫీచర్లు మాత్రం బుర్రపాడు..!

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి. హీరో జూమ్ కంబాట్ ఎడిషన్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఈ క్లస్టర్‌లో స్పీడోమీటర్, మైలేజ్ ఇండికేటర్, తక్కువ ఇంధన ఇండికేటర్, ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, కార్నరింగ్ లైట్లు, L-ఆకారపు LED DRLలు, 12-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, USB మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ముందు భాగంలో 190 మిమీ డిస్క్ లేదా 130 మిమీ డ్రమ్ బ్రేక్‌తో ఉంటుంది. వెనుక భాగంలో 120 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

Xoom కంబాట్ ఎడిషన్ సాధారణ Xoom స్కూటర్‌లో ఉన్న అదే 110.9 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,250rpm వద్ద 8.05bhp శక్తిని.. అలాగే 5,750rpm వద్ద 8.7Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ మృదువైన పనితీరు కోసం CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఇది రూ. 80,967 (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులోకి వచ్చింది.

Tags

Related News

Navyug Express Train: కాశ్మీర్ to కన్యాకుమారి- దేశంలో ఎక్కువ రాష్ట్రాలు దాటే రైలు ఇదే, ఎన్ని గంటలు జర్నీ చేస్తుందో తెలుసా?

New Railway Super App: టికెట్ బుకింగ్ నుంచి PNR స్టేటస్‌ చెక్ వరకు.. అన్ని సేవలూ ఓకే చోట, త్వరలో సూపర్ యాప్ లాంచ్ చేయబోతున్న రైల్వే

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

Petrol, diesel prices : తగ్గిన చమురు ధరలు.. పెట్రలో, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. ప్రభుత్వం ఏం చెబుతోందంటే?..

డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఈ వాహనాలు నడపొచ్చు, పోలీసులు పట్టుకోరు, ఫైన్లు ఉండవు తెలుసా!

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

Big Stories

×