EPAPER
Kirrak Couples Episode 1

Gold Rate Today: బంగారం కొనే ఉద్దేశం ఉందా? అయితే ముందుగా ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసుకోండి..

Gold Rate Today: బంగారం కొనే ఉద్దేశం ఉందా? అయితే ముందుగా ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసుకోండి..

Gold Rate Today: ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ప్రతిరోజూ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. బంగారం కొనాలనుకుంటే.. సామాన్యులకే కాదు, సంపన్నులకు గోల్డ్ రేట్స్ షాకుల మీద షాకులిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ ఛేంజ్(MCX) అయినా దేశీయ మార్కెట్ అయినా బంగారం ధర రూ.77 వేలు దాటేసింది. బడ్జెట్ 2024లో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై పన్ను శాతం తగ్గించడంతో గోల్ట్ రేట్స్ తగ్గాయి. అయితే ఆ ఊరట్ కొన్ని రోజులు మాత్రమే. మళ్లీ నిరాటకంగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నెల చివరి వారంలో కేవలం మూడు రోజుల్లో గ్రాము బంగారం ధర రూ.200 పెరిగింది.


బంగారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా ధరలక పెరగడం శుభవార్తే అయినా? కేవలం ఇంట్లో శుభకార్యాలకు కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ఇప్పుడు లైఫ్ టైమ్ గరిష్టానికి నమోదయ్యాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 26 నాటికి 10 గ్రాముల బంగారం ధర- 24 క్యారెట్లు రూ. 70,600. గత వారం రోజులుగా చూస్తే గ్రాముపై రూ.2,900 ధర పెరిగింది. ఇంత పెద్ద మార్పుకి కారణం.. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడమే.

Also Read: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్


వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దీంతో ఇన్వెస్టర్లంతా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా డాలర్ రేటు కూడా బలహీనమవుతుంది. ఈ కారణంగా బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్ కు 2655 డాలర్ లెవెల్స్ ఉంది. ఆగస్టు నెలలో 22 క్యారెట్ల బంగారం ధర కనిష్టంగా రూ.63500 ఉండేది. అదే సెప్టెంబర్ 25 నాటికి ఈ ధర రూ.70,600కు చేరింది. అంతే కేవలం మూడు వారాల్లో పసిడి ధర ఏకంగా రూ.7000 పెరిగింది. ప్రస్తుతం (సెప్టెంబర్ 26) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,020 ఉంది.

ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర. రూ. 77,170 ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చూసుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600 కాగా 24 క్యారెట్ ధర రూ.77,020 ఉంది.

గోల్డ్ ఫ్యూచర్స్ కూడా కమోడిటీ ఎక్స్ ఛేంజ్ లో భారీ ధర పలుకుతోంది. ఈ వారం అక్టోబర్ 4 ఫ్యూచర్స్ క్లోజింగ్ చూసుకుంటే ప్రారంభంలో రూ.75000 ఉండగా.. వేగంగా పెరిగి రూ.76000 వరకు చేరింది.

Related News

Vande Bharat Express: ఖాళీగా నడుస్తోన్న సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. రైల్వే షాకింగ్ నిర్ణయం

Festive Discounts: పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Indian Railways: భారత్‌లో ఈ రైల్వే స్టేషన్ చాలా స్పెషల్, ఫ్లాట్ ఫారమ్ మీదకి వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే!

iphone 16 Delivery in 10 minutes : పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..

Electric Car Under Rs 5 Lakh: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

Big fat Indian weddings: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

Big Stories

×